Begin typing your search above and press return to search.
ఫాస్ట్ గానే రియాక్టయిన బండి సంజయ్
By: Tupaki Desk | 23 Feb 2022 6:04 AM GMTపార్టీ నేతలు ఎంతటి వారైనా కట్టుతప్పితే వేటు తప్పదంటు తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ గట్టి వార్నింగే ఇచ్చారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు అసమ్మతి లేవదీస్తున్న విషయంపై బండి సీరియస్ గానే స్పందించారు. బండి వ్యవహారశైలికి వ్యతిరేకంగా పార్టీలోని కొందరు నేతలు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో కొందరు నేతలు రహస్యంగా సమావేశమైనట్లు బాగా ప్రచారం జరుగుతోంది.
పార్టీ నేతలు గుజ్జుల రామకృష్ణ, సుగుణాకర్, వెంకట రమణితో పాటు మరికొందరు సమావేశం జరిపారని మీడియాలో బాగా ప్రచారమైంది. బండికి వ్యతిరేకంగా నేతలు సమావేశం అవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక సమావేశం కరీనంగర్లో జరిగింది. కాకపోతే అప్పుడు జరిగిన సమావేశం జిల్లాకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇపుడు జరిగిన సమావేశం ఇంకా విస్తృతమైనది. అందుకనే బండి కూడా సీరియస్ గా స్పందించారు.
బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఎవరు హద్దులు దాటినా వెంటనే వేటు తప్పదంటు గట్టిగానే వార్నింగిచ్చారు. కాకపోతే ఎవరిపేరు ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించలేదు. పార్టీలోని నేతలు ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు కట్టుబడి పనిచేయాల్సిందే అని స్పష్టంగా ప్రకటించారు. పైగా ప్రతి పార్టీలోను అసమ్మతి వాదులున్నట్లే బీజేపీలో కూడా ఉన్నారంటు చాలా లైటుగా తీసుకున్నారు. వాళ్ళు పని చేయరు, ఇతరులను పనిచేయనీయరంటు సెటైర్లు కూడా వేశారు.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమే అన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రతి నేత తన పరిధిలో కష్టపడి పనిచేయాలని చెప్పారు. తనకు వ్యతిరేకంగా జట్టుకట్టే నేతల మాటలు విని ఎవరైనా మోసపోతే అది వాళ్ళిష్టమన్నారు. అసమ్మతి కార్యక్రమాలతో, సమావేశాలతో పార్టీని ఎవరు నియంత్రించలేరని కూడా బండి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా బండికి వ్యతిరేకంగా పార్టీలో అసమ్మతి కార్యక్రమాలు మొదలయ్యాయనేది వాస్తవం. మరి అసమ్మతి సమావేశాలు పెట్టుకునే నేతల వెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది.