Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా మనిషి: బండి సంజయ్
By: Tupaki Desk | 4 Aug 2022 10:30 AM GMTతమ్ముడిని లాగేసిన బీజేపీ.. ఇప్పుడు అన్నకు గురిపెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే తమ్ముడు బీజేపీలో చేరితే అన్న ఊరుకుంటాడా? అంటే ఊరుకున్నాడు. తమ్ముడు వెళ్లడాన్ని ఆపలేదు. సరికదా? దీన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ వాదులపై ఒంటికాలిపై లేచాడు. అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో ఏంటది? అని ఎవ్వరు అడిగినా వెంకటరెడ్డి మాత్రం ‘మా తమ్ముడు రాజీనామా చేసి వెళ్లాడు కదా? రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారు ’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
కోమటిరెడ్డి బ్రదర్స్ లొల్లి ఇప్పుడు కాంగ్రెస్ లో మరో అసమ్మతికి దారితీస్తోంది. రాజగోపాల్ రెడ్డి దారిలోనే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళతాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి వెంకటరెడ్డి దీన్ని ఖండిస్తున్నా భవిష్యత్తులో.. ఎన్నికల వేళ ఏమైనా జరగవచ్చు. ఈ క్రమంలోనే వీటికి ఊతం ఇచ్చేలా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశాడు.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బాంబు పేల్చాడు. 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అటు కాంగ్రెస్ తోపాటు ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలతో కలవరపడుతోంది.
ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాక.. ఇప్పుడే మునుగోడు బైపోల్ లో ఎలా సిద్ధమవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎదురుచూస్తుంటే.. మరో 12మంది టచ్ లో ఉన్నారని.. మరిన్ని ఉప ఎన్నికలు తప్పవంటూ బండి సంజయ్ చెప్పిన డైలాగ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది.
ఇక మరీ ముఖ్యంగా బీజేపీతో 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు గాబరాపడుతున్నాయి. ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారోనని టెన్షన్ పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. దీనికి టీఆర్ఎస్ నాయకులే కారణమవుతారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ నాలుగు ఉప ఎన్నికల్లో రెండు బీజేపీ గెలిచింది అంటూ ఈ సందర్భంగా మరింత కాకపెంచే విషయాన్ని బండి సంజయ్ తెలిపారు. త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను నిర్మిస్తుందన్నారు. అదే వచ్చేసారి గెలుపు ఎవరిదన్నది తేలుస్తుందని బండి అంటున్నారు.
ఇక బీజేపీతో టచ్ లో ఉన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారా? లేక విడతల వారీగా చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. లేక ఎన్నికల వేళ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.