Begin typing your search above and press return to search.

గుండ్రాంపల్లి చరిత్ర చెప్పి రక్తం మరిగేలా చేసిన బండి సంజయ్

By:  Tupaki Desk   |   10 Aug 2022 6:20 AM GMT
గుండ్రాంపల్లి చరిత్ర చెప్పి రక్తం మరిగేలా చేసిన బండి సంజయ్
X
తరచూ చరిత్రను ప్రస్తావించి.. వాళ్లు అంత అన్యాయం చేశారు. వీళ్లు ఇంత దోపిడీ చేశారని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చరిత్రలో జరిగిన దారుణ ఘట్టాలు.. రజాకార్ల దారుణాల గురించి ఎందుకు చెప్పరన్న సందేహం కలిగేలా చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాజాగానిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజు రాత్రి (మంగళవారం) పది గంటల సమయానికి గుండ్రంపల్లికి చేరుకున్నారు.

అప్పటికి ఆయన కోసం వేలాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకుపాదయాత్ర చేసినప్పటికీ ఎలాంటి అలసట లేకుండా.. రాత్రి పది గంటల వేళలో గుండ్రంపల్లికి చేరుకున్న బండి సంజయ్..తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూసి రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

మరోకీలక పరిణామం ఏమంటే..రజాకార్ల సమయంలో గుండ్రంపల్లిలో జరిగిన దారుణం గురించి ప్రసంగించిన వైనం అక్కడి వారిని పాత గాయాల్ని గుర్తు చేస్తే.. ఈ ఊరు గురించి.. ఈ ఊరికి జరిగిన దారుణం గురించి తెలియని వారి రక్తం మరిగేలా చేసింది. చరిత్రను చెప్పిన బండి సంజయ్ ప్రసంగం విన్న వారు.. ఆ గ్రామం గురించి ఎప్పుడు సీఎం కేసీఆర్ ప్రస్తావించలేదే? అన్న మాట వినిపించటం గమనార్హం. ఇంతకీ బండి ఏం చెప్పారు? నిప్పులు చెరిగినట్లుగా ఉన్న ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- గుండ్రాంపల్లి అంటేనే ఆవేశం, పౌరుషాల గడ్డ. నిజమైన గుండ్రాంపల్లి చరిత్ర విన్నాను. ఢిల్లీలో సమావేశం అయినప్పుడు అమిత్ షా గుండ్రాంపల్లి చరిత్ర విన్నాను అని చెప్పారు. నేను ఎన్నో ప్రాంతాలు తిరిగినా... కానీ గుండ్రాంపల్లి చరిత్రను చూశాక..ఇది మామూలు ప్రాంతం కాదు.. ఇక్కడున్న మట్టిని ముఖాన రుద్దుకుంటే పౌరుషం కలుగుతుందని అమిత్ షా గారు చెబితే వచ్చాను.

- ఎంత గొప్ప చరిత్ర అన్నా ఈ ఊరిది. ఒళ్లు పులకరిస్తుంది. రోమాలు నిక్కబొడుసుకుంటున్నాయి. ఈడ పుట్టకపోవడం నా దురదృష్టం. ఎంతోమంది వీరులు బలిదానం చేసిన గడ్డమీద మీరు పుట్టడం మీ అదృష్టం. కాశిం రజ్వి పై సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎదిరించిన చరిత్ర గుండ్రాంపల్లిది. ఇక్కడ ఆడవాళ్లపై సయ్యద్ మక్బుల్ ఎలా అత్యాచారాలు చేసాడో.. జనాలను ఎలా చంపాడో.. ఎలా బావిలో వేసి చంపాడో మనందరికీ తెలుసు.

- పాండవులు నడయాడిన నేల గుండ్రాంపల్లి నేల. గుండ్రాంపల్లిలో రజాకార్ల అరాచకాలకు ఎందరో బలయ్యారు. ఈ చరిత్ర ఎందుకు తెరమరుగు అయింది? ఖాసీం రజ్వి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఝాన్సీ రాణి పుట్టిన గడ్డ గుండ్రాంపల్లి గడ్డ. రజాకార్లను తరిమికొట్టిన గడ్డ గుండ్రాంపల్లి గడ్డ. గుండ్రాంపల్లి అంటేనే ఆవేశం, పౌరుషాల గడ్డ.

- గుండ్రాంపల్లి గడ్డి పోసలు కూడా గునపాలేనట. గుండ్రాంపల్లి గాలి కూడా గర్వంగా తలెగరేస్తదట. అవునా అన్నా.. గుండ్రాంపల్లి నీళ్లు తాగితే నిప్పు కణికలై మండుతరట నిజమేనా? కొడవళ్లు చేత పట్టి నిజాం రజాకార్లను తరిమిన మా అక్కల పౌరుషం ఈ నయా నిజాం కేసీఆర్ ను గద్దె దింపేందుకు మల్లోసారి నడుం కట్టాలె.

- తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం వస్తే మొదటిసారి గుండ్రాంపల్లికే వస్తానని అమిత్ షా అన్నారు. గుండ్రాంపల్లి వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టాలని అమిత్ షా అన్నారు. ఇక్కడ స్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడి చరిత్రను తెరమరుగు కానివ్వం. తెలంగాణ చరిత్రనే తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజాం మెడలు వంచి మనకు స్వాతంత్రం ఇచ్చిన ఘనత సర్ధార్ వల్లభాయ్ పటేల్ దే.

- సెప్టెంబర్ 17న మన తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవంగా 17 సెప్టెంబర్ ను జరుపుకోవాలి. కేసీఆర్ అంటే... ఖాసిం చంద్రశేఖర్ రజ్వి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాదు... మక్బుల్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతానన్న కేసీఆర్ హామీ ఏమైంది?

- గుండ్రాంపల్లి వస్తే 360 మంది అమరుల చరిత్ర తెలుస్తుందని కేసీఆర్ ఆ చరిత్రని తెలియనివ్వడం లేదు. ఎందుకంటే తన కుటుంబ చరిత్రే తెలవాలని అనుకుంటాడు . సెప్టెంబర్ 17ను ఎట్టి పరిస్థితుల్లోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిందే. మనిషి చనిపోయినా... తన చరిత్ర తరతరాలు నిలిచేలా బతకాలి. ఏదో ఒక ధర్మకార్యం చేస్తేనే సమాజం బాగుపడుతుంది. కెసిఆర్ తన కుటుంబ చరిత్రను రాబోయే తరాలకు అందించాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు.

- బీజేపీ కార్యకర్తలను కెసిఆర్ రాచిరంపాన పెడుతున్నాడు. కెసిఆర్ ను ప్రశ్నిస్తే కాళ్లు, చేతులు విరగ కొడుతున్నారు. కాశీం రజ్వి పార్టీ ఎంఐఎం పార్టీ... రజాకార్ల పార్టీ ఎంఐఎం పార్టీ. టిఆర్ఎస్ పార్టీ అంటేనే... తెలంగాణ రజాకార్ల పార్టీ. ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ... అమరుల త్యాగాలను అవమానించడం కాదా? టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది.

- కేవలం మైనారిటీ ఓట్ల కోసమే ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంది. గుండ్రాంపల్లి చరిత్రను తప్పకుండా పాఠ్య పుస్తకాంశాల్లో ఉంచుతాం. గుండ్రాంపల్లిలోని అమరుల వారసులకు ఇండ్లు, పెన్షన్లు ఇప్పించే బాధ్యతను బిజెపి తీసుకుంటుంది. కెసిఆర్ ను గద్దె దించేందుకు మీరంతా బిజెపి కి అండగా ఉండాలని కోరుతున్నాం.