Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ ట్వీట్‌... వైర‌ల్‌

By:  Tupaki Desk   |   11 March 2022 9:30 AM GMT
కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ ట్వీట్‌... వైర‌ల్‌
X
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌లు అత్యంత స‌హ‌జం. నాయ‌కులు కామెంట్లు చేసుకున్నంత మాత్రాన శ‌త్రువులు కావాల్సిన అవ‌స‌రం లేదు క‌దా?. అలాంటి హుందా రాజ‌కీయాల‌నే క‌దా ప్ర‌జ‌లు కోరుకునేది. తాజాగా తెలంగాణ‌లో అదే జ‌రిగింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేసిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉప్పునిప్పులా ఉండే కేసీఆర్ - బండి సంజ‌య్ సంబంధాల్లో ఈ ట్వీట్ అభినంద‌నీయ‌మ‌ని అంటున్నారు.

స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సీఎంకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ముందుగా నార్మల్ టెస్టులు నిర్వహించిన డాక్టర్లు... ఆ తర్వాత సీఎంకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. అయితే యాంజియోగ్రామ్ టెస్ట్ నార్మల్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు ఎలాంటి బ్లాక్స్ లేవన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు MRI టెస్టు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, సీఎం కేసీఆర్ అనారోగ్యం నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ఉప్పల్ పర్యటనను హడావుడిగా ముగించుకుని తిరిగొచ్చారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా తన మామ అయిన కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసింది. దీంతో ఆయన అసెంబ్లీ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు.

కాగా, కేసీఆర్ కు ఆరోగ్య ప‌రీక్షల నేప‌థ్యంలో బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాజ‌కీయాల్లో హుందా త‌నాన్ని చాటుతోంద‌ని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా, సీఎం కేసీఆర్ కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటామని సీఎం వ్యక్తిగత డాక్టర్ M.V రావు తెలిపారు. సీఎం కేసీఆర్ త‌న‌కు రెండ్రోజులుగా ఎడమ చేయి లాగుతోందని చెప్పడం.. రెండ్రోజులుగా వీక్ గా కనిపించడంతో వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వచ్చామని సీఎంఓ వైద్యులు డాక్టర్ ఎం.వీ రావు వెల్లడించారు.

కేసీఆర్ కు యాంజియోగ్రామ్, జనరల్ చెకప్ జరుగుతోందని డాక్టర్ ఎం.వి.రావు మీడియాతో తెలిపారు. యాంజియో గ్రామ్ టెస్టులో అంతా నార్మల్ అని వచ్చిందని.. గుండె, రక్త నాళాల్లో ఎక్కడా క్లాట్స్ లేవని వెల్లడైందన్నారు.