Begin typing your search above and press return to search.
ఏపీ సర్కార్ కు బండి సంజయ్ హెచ్చరిక
By: Tupaki Desk | 4 Jan 2021 3:51 PM GMTఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం వైఎస్ జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ ప్రజల సహనాన్ని పిరికితనంగా భావించవద్దని వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్ ట్రీట్ మెంట్ తప్పదని బండి సంజయ్ తాజాగా ఏపీ సర్కార్ ను హెచ్చరించాడు. బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే మూటముల్లె సర్దుకునేలా తరిమికొడతారన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం దేశమంతా ఎదురుచూస్తోందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని బండి కోరారు... దుబ్బాక, జీహెచ్ఎంసీలోలా తిరుపతిలోనూ అధికార పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చాడు.బైబిల్ పార్టీనో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని కోరారు.
ఏపీలో దేవుళ్ల విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దమ్మున్న కార్యకర్తలు ఉన్నారని, వారి సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు. ఏపీలో హిందూ ధర్మంపై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఇక్కడ అధికార పార్టీ ఒక మతానికి వత్తాసు పలుకుతుంటే... అక్కడ ఒక మతమే రాజ్యం ఏలుతోందని అన్నారు.
తిరుపతిలో హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలని.. ఏడుకొండల వాడ వెంకటరమణ అనే పార్టీ కావాలా? బైబిల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.