Begin typing your search above and press return to search.

ఏపీలో రోత రాజకీయమా....బండ్లన్నా అలా అనేసావేంటి...?

By:  Tupaki Desk   |   29 Dec 2022 3:30 PM GMT
ఏపీలో రోత రాజకీయమా....బండ్లన్నా అలా అనేసావేంటి...?
X
బండ్ల గణేష్. ఎస్వీ క్రిష్ణారెడ్ది సినిమాలలో చిన్నపాటి కమెడియన్ గా కనిపించి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి సినిమాలు తీసే స్థాయికి చేరారు. ఇక ఆయన బడా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. మరో వైపు వ్యాపారాలు ఉన్నాయి. ఇక రాజకీయంగా ఆయన 2018 టైం లో కాంగ్రెస్ లో చేరి హల్ చల్ చేశారు. ఆ తరువాత కొంతకాలం పాటు రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చారు.

మళ్లీ సడెన్ గా తనకు అందరూ అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారని చెబుతూ రాజకీయాలకు స్వస్తి అనేశారు. అలా అన్న బండ్ల గణేష్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్ది మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చారు మొత్తానికి బండ్ల గణేష్ వివాదాలతో తనదైన మాటల దూకుడుతో ఏదో విధంగా నలుగుతూ ఉంటారు.

ఆయన లేటెస్ట్ గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకా ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో చాలా సంచలన విషయాలే ఉన్నాయి. ఇక చూస్తే బండ్ల తాను చిన్న నటుడిగా ఉన్న దగ్గర నుంచి ఈ రోజుకీ ఈ స్థాయికి ఎలా ఎదిగిందీ చెబుతూ వచ్చారు. అలాగే తన రాజకీయ జీవితం తనకు ప్రముఖులతో ఉన్న విభేదాలు మాట పట్టింపులూ మంచీ చెడ్డా అన్నీ కూడా పంచుకున్నారు.

ఈ సందర్భంగా సదరు చానల్ వారు బండ్లను ఏపీ పాలిటిక్స్ మీద వేసిన ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు అయితే షాకింగ్ గా ఉంది ఏపీ రాజకీయమే రోత అంటూ బండ్లన్న బోల్డ్ గా కామెంట్ చేసి పారేశారు. అక్కడ ఎంతసేపూ కులాల ఆధిపత్యంతో పాలిటిక్స్ నడుస్తూ ఉంటుంది. కులాలను వేరు చేసి కొట్టుకోవడమే అంటూ బండ్ల కామెంట్స్ చేయడం బట్టి చూస్తే ఆయన ఫుల్ ఇంటర్వూలో ఎంత ఫైర్ అయి ఉంటాడో ఏ రేంజిలో జవాబు చెప్పి ఉంటాడో అన్న చర్చ సాగుతోంది.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద ట్వీట్లు వేయడం మీద కూడ బండ్ల గణేష్ చెప్పారు. పెద్దాయన రామోజీరావు మీద విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో తాను అలా స్పందించాల్సి వచ్చిందని బండ్ల అన్నారు. అయితే తాను విజయసాయిరెడ్డి మీద ట్వీట్ వేయగానే మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి కేకలు వేశారన్న సీక్రెట్ మ్యాటర్ ని కూడా లీక్ చేశారు. మరి బొత్స ఎందుకు అలా కేకలేశారు. ఆయనకు విజయసాయిరెడ్డి ఈ విషయం చెప్పారా అన్నది కూడా ఫుల్ ఇంటర్వ్యూలోనే చూడాల్సి ఉందేమో.

మరో వైపు చూస్తే కమ్మ కాపు వర్గ పోరు మీద కూడా ఫుల్ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కామెంట్స్ చేశారని అంటున్నారు. తనకు రాజకీయంతో పనిలేదని అంటూనే ఇలా ఇంటర్వ్యూలో బండ్ల మాట్లాడడం, ఏపీలో రోత రాజకీయం సాగుతోందని అనడంతో ఆయన ఎవరిని టార్గెట్ చేశారు ఎవరి మీద విమర్శలు చేశారు అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. మరి ఫుల్ ఇంటర్వ్యూలో బండ్ల మనోగతం బయటపడే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే బండ్ల కామెంట్స్ మీద ఆయన ఇంటర్వ్యూల మీద కూడా ఇంటరెస్ట్ పెట్టే ఒక సెక్షన్ ఉంది. సో ఈ ఇంటర్వ్యూ ఇపుడు షాకింగ్ గా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.