Begin typing your search above and press return to search.
కోడెల మృతిపై బండ్ల గణేష్ ట్వీట్లు
By: Tupaki Desk | 16 Sep 2019 5:15 PM GMTఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతే అతి పెద్ద చర్చనీయాంశం. సుదీర్ఘ కాలం మంత్రిగా - ఐదేళ్లు స్పీకర్ గా కూడా పని చేసిన ఆయన చివరికిలా ఆత్మహత్య చేసుకుని చనిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే ప్రాథమికంగా ఆత్మహత్యగా పేర్కొంటున్నా.. ఆయన మృతిపై రకరకాల ఊహాగానాలు - ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో - సామాజిక మాధ్యమాల్లో కోడెల గురించి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐతే చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నాడు నటుడు - నిర్మాత - కొంత కాలం రాజకీయాల్లో కూడా ఉన్న బండ్ల గణేష్. తనకు కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతిని రాజకీయం చేయొద్దని బండ్ల కోరాడు.
కోడెల మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాకు అత్యంత అత్మీయులైన నాకు నా కుటుంబానికి తీరని నష్టం. వారి ఆత్మకు శాంతి చేకూరాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. దయచేసి ప్రతీ రాజకీయ నాయకుడికి చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. చనిపోయిన వ్యక్తి గురించి.. చనిపోయిన మనిషి గురించి రాజకీయాలు చేయొద్దు. అని బండ్ల ట్విట్టర్ లో పేర్కొన్నాడు. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారి.. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన బండ్లకు ఏపీలో రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. కోడెలతో కూడా బండ్లకు మంచి అనుబంధమే ఉన్నట్లు తెలుస్తోంది.