Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్..ఓమంచి కామెడీ పొలిటీషియన్
By: Tupaki Desk | 14 Nov 2018 6:34 PM GMTబండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. సినీ రంగంలోని ప్రముఖ కమెడీయన్లలో ఆయన ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లలో కూడా సుప్రసిద్ధుడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కూడా అందరి చూపును బండ్ల గణేష్ తనవైపు తిప్పుకొన్నారు. అయితే, ఇలా పొలిటీషియన్ గా మారిన బండ్ల గణేష్....తన పూర్వశ్రమం అయిన కామెడీని వదిలిపెట్టడం లేదా లేకపోతే...సరైన అవగాహన లేకపోవడం వల్ల అలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ టీవీ ఛానల్ల డిస్కషన్లలో పాల్గొంటున్న ఆయన సదరు చర్చల్లో కూడా కామెడీ చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాబితాల రూపంలో అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాజేంద్రనగర్ స్థానాన్ని సస్సెన్ష్ పెడుతూ ఉత్కంఠను కంటిన్యూ చేస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తమకు కేటాయించాలంటూ టీటీడీపీ కోరుతోంది. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ సీటు బండ్లగణేష్‌కు ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలా చర్చోపచర్చల నేపథ్యంలో గణేష్‌ను ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు పిలిచింది. అయితే, ఈ చర్చలో బండ్ల గణేష్ ఊహించని కామెడీ పంచారు.
ఇంతకీ ఆయన చేసిన కామెడీ ఏంటయ్య అంటే...తెలంగాణ మంత్రి కేటీఆర్ వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేశారట. హైదరాబాద్ నగరంలో గుంతలు గుర్తించిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో మోడీ బెంబేలెత్తిపోయారని బండ్ల గణేష్ విశ్లేషించారు. వెయ్యి నోట్లన్నీ హైదరాబాద్‌కు తరలివెళ్తాయని భయపడిపోయిన మోడీ దాంతో నోట్ల రద్దు చేశారని లాజిక్ లేని సిల్లీ ప్రకటన చేశారు. దీంతో అవాక్కవడం, నవ్వుకోవడం యాంకర్ వంతు అయింది. కాగా, బండ్ల గణేష్ మాటలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.