Begin typing your search above and press return to search.
మొన్న కేసీఆర్ కు ఇప్పుడు రోజాకు థ్యాంక్స్
By: Tupaki Desk | 30 March 2020 4:30 PM GMTకరోనా వైరస్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోతున్న విషయం తెల్సిందే. దాదాపు అన్ని రంగాలను కూడా కరోనా వైరస్ కుదేలయ్యేలా చేస్తుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పుకార్ల వల్ల ఫౌల్ట్రీ ఫామ్ కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. కరోనాకు ఫౌల్ట్రీ ఫామ్ కు సంబంధం లేకున్నా చికెన్ గుడ్లు తిన్నా కూడా ఎలాంటి ప్రమాదం లేదు. కాని సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా చికెన్ తినాలంటే జనాలు భయపడి పోతున్నారు.
సీఎం కేసీఆర్ మొన్న మీడియాతో మాట్లాడుతూ చికెన్ తినడం వల్ల ఎలాంటి ఆనారోగ్యం కాదని పైగా చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తప్పకుండా తినాలని సూచించాడు. కేసీఆర్ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ వదంతుల వల్ల ఫౌల్ట్రీ ఫామ్ తీవ్రమైన సంక్షోభంను ఎదుర్కొంటుందని ప్రజలు వదంతులు నమ్మవద్దని ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. కేసీఆర్ వ్యాఖ్యలపై కృతజ్ఞతలు తెలియజేసిన బండ్ల బాబు ఈసారి ఎమ్మెల్యే రోజాకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎమ్మెల్యే రోజా ఇంటికి పరిమితం అయ్యి కుటుంబ సభ్యులకు సొంతంగా వండి పెడుతున్న విషయం తెల్సిందే. మొన్న ఫిష్ వంటకం వండి పెట్టిన రోజా తాజాగా చికెన్ ఫ్రై ను కుటుంబ సభ్యులకు వండి పెట్టింది. చికెన్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెబుతూ ఆమె చికెన్ ఫ్రై చేసింది. చికెన్ పట్ల అవగాహణ కల్పించి పుకార్లను తరిమికొట్టేలా రోజా వీడియో చేసినందుకు బండ్ల గణేష్ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశాడు. బండ్ల గణేష్ మరో ట్వీట్ లో ఒక కోడికి ముద్దు పెడుతూ మా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.