Begin typing your search above and press return to search.
7ఓ క్లాక్ బ్లేడు.. ముసలోళ్ల కథ చెప్పిన బండ్ల
By: Tupaki Desk | 24 Dec 2018 4:43 AM GMTబండ్ల గణేష్.. నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి అనంతరం రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాడు. క్రేజ్ ను వాడుకోవాలని రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టికెట్ కన్ఫం అనుకొని ఏకంగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు. ‘బండ్ల గణేష్ అనే నేను’ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ గెలవకపోతే ‘7ఓ క్లాక్ బ్లేడ్’తో గొంతు కోసుకుంటానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. కట్ చేస్తే బండ్లకు టికెట్ రాలేదు.. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది.
ఓటమి భారంతో పది రోజులు ఇంటి నుంచి కాలు బయటపెట్టని బండ్ల ఇప్పుడిప్పుడే బయటకొచ్చి పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా తెలుగు టాప్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ అదే ప్రశ్న ఎదుర్కొన్నారు. ‘7ఓ క్లాక్ బ్లేడుతో పాపుల్ అయిన మీరు అదే పేరుతో సినిమా తీస్తారా’ అన్న ప్రశ్నకు కోపంగా సమాధానమిచ్చారు...
బండ్ల గణేష్ ఎప్పుడూ ఒక వస్తువుతో పాపులర్ కాలేదని.. నటుడిగా, నిర్మాతగా 20 ఏళ్లుగా కష్టపడి పైకి వచ్చానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాన్ దయ వల్ల భారీ నిర్మాతను అయ్యానని వివరించారు. ఓడిన చోటే గెలుస్తానని.. రాబోయే 20 ఏళ్లలో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పుకొచ్చారు. ఎంత బాగా మెట్లు ఎక్కుతానో ఎలా దిగజారుతానో తనకు తెలుసు అని బండ్ల అన్నారు. ఈ బ్లేడుల వల్ల.. గీజర్ ల వల్ల, కత్తుల వల్ల తనకు పేరు వచ్చిందనడం పొరపాటు అని బండ్ల అన్నారు.
కాంగ్రెస్ కు వృద్ధాప్యం వచ్చిందని బండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్ పైలెట్, రాహుల్, అఖిలేష్ లను చూస్తుంటే అద్భుతమనిపిస్తోందని.. వారిని చూస్తే యువత రక్తం ఉప్పొంగోతోందన్నారు. రాజకీయాల్లో వృద్ధ నేతలు గౌరవంగా రాజ్యసభ పెద్ద పోస్టులు తీసుకొని వెనుకండి నడిపించాలని.. తెలుగు రాష్ట్రాల్లో యువతకు అవకాశం ఇవ్వాలని బండ్ల కోరారు. 70,80 ఏళ్లు వచ్చినా ఇంకా మేమేం అంటే మాకు 70 ఏళ్లు వచ్చాక రాజకీయం చేయాల్సి వస్తుందని బండ్ల చెప్పుకొచ్చారు. వాళ్లు పనిచేయలేరని..మమ్మల్ని పనిచేయనివ్వాలని బండ్ల సూచించారు. నాయకుడంటే చెమట వాసన ప్రజలకు తెలిసేలా కనిపించాలని బండ్ల చెప్పుకొచ్చారు. ఏం కసిగా చేస్తున్నాడురా అనేలా కనిపించాలని సూచించారు.
బండ్ల తాజాగా కాంగ్రెస్ వృద్ధ నాయకుల నుంచి విడిపోవాలని యువతకు అవకాశం రావాలని కామెంట్ చేయడం కాంగ్రెస్ సీనియర్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంది. ముసలోళ్లు దూరంగా ఉండాలన్న బండ్ల కామెంట్లకు కాంగ్రెస్ సీనియర్లు ఎలాంటి లొల్లి చేస్తారన్నది వేచిచూడాల్సిందే..