Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. ఆ సీక్రెట్ ఏంటబ్బా?

By:  Tupaki Desk   |   27 March 2022 7:30 AM GMT
ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. ఆ సీక్రెట్ ఏంటబ్బా?
X
ఎప్పుడూ సంచలనాలకు మారుపేరుగా ఉండే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే బండ్ల గణేష్ ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయ నేతలతో మంతనాలు జరుపుతూనే ఉంటాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి బండ్ల గణేష్ చేతులు కాల్చుకున్నాడు. చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డాడు. కోరి సమస్యలను తెచ్చుకున్నాడు. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసి బండ్ల గణేష్ చర్చలు జరపడం సంచలనమైంది. అసలు బండ్ల గణేష్ యూపీ సీఎంను ఎందుకు కలిశాడు? ఆ మతలబేంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ ఇలానే పలువురు కీలక నేతలతో ఇలా వెళ్లి అలా కలిసి వచ్చిన బండ్ల గణేష్ తాజాగా ఉత్తరప్రదేశ్ కు వరుసగా రెండోసారి సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ ను కలిసి ఫొటో దిగారు.

సీఎం యోగితో ఉన్న ఫొటోను బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. యూపీకి వరుసగా రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పరమేశ్వరుడు ఆయనకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ ఫొటోను చూసిన వారు బండ్ల గణేష్ రాజకీయంగా మంచి సంబంధాలే నెరుపుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.. బండ్లన్నా నువ్వు కేక అంటూ కామెంట్చేస్తున్నారు.

కాగా యూపీ సీఎంను బండ్ల గణేష్ ఎందుకు కలవాల్సి వచ్చింది. ఆ భేటి వెనుక కథేంటి? అన్నది తెలియాల్సి ఉంది.