Begin typing your search above and press return to search.

ఆ జాబితాలో బెంగుళూరుకు అగ్ర‌స్థానం!

By:  Tupaki Desk   |   24 March 2018 8:56 AM GMT
ఆ జాబితాలో బెంగుళూరుకు అగ్ర‌స్థానం!
X
భార‌త్ లో ఐటీ రంగ నిపుణుల‌కు ఉపాధి అవ‌కాశాలున్న న‌గరంగా బెంగుళూరు ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. అక్క‌డి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కూడా ఆ న‌గ‌రానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా, బెంగుళూరుకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. త‌క్కువ ఖ‌ర్చుతో నివాస‌యోగ్య‌మైన న‌గ‌రాల జాబితాలో బెంగుళూరు ఆసియాలో అగ్ర‌స్థానంలో నిలిచింది. ``ది ఎక‌న‌మిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్స్ వ‌ర‌ల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ స‌ర్వే-2018``లో ఆసియాలోనే చీపెస్ట్ సిటీగా బెంగుళూరు నిలిచింది. అత్యంత ఖ‌రీదైన న‌గ‌రంగా సింగ‌పూర్ నిలిచింది. స‌ర్వే నిర్వ‌హించిన 133 దేశాల్లోని న‌గ‌రాల్లో బెంగుళూరు 129వ స్థానం ద‌క్కించుకుంది.

బెంగుళూరులో ల‌భించే 150 ర‌కాల ఉత్ప‌త్తులు, వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌ల‌ ఆధారంగా ఆ స్థానం ద‌క్కింది. ఆ త‌ర్వాత చెన్నై 126వ స్థానంలో ఉండ‌గా....దేశ రాజ‌ధాని ఢిల్లీ....124వ స్థానంలో నిలిచింది. సిరియాలోని డ‌మాస్క‌స్, వెనెజులా రాజ‌ధాని క‌రాక‌స్, నైజీరియ‌న్ మెట్రోపొలిస్ లాగోస్ లు చీపెస్ట్ న‌గ‌రాల జాబితాలో బెంగుళూరు క‌న్నా ముందు ఉన్నాయి. ఆ ప్రాంతాల‌లోని రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో అవి చీపెస్ట్ న‌గ‌రాల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. అయితే, ఈ స‌ర్వేపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బెంగుళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ‌ని, అది ఆసియాలోనే చీపెస్ట్ సిటీగా స్థానం ద‌క్కించుకోవ‌డం హాస్యాస్పద‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.