Begin typing your search above and press return to search.
నటులపై పోస్ట్ పెట్టినందుకు చితకబాదారు!
By: Tupaki Desk | 11 Sep 2016 7:22 AM GMTతమిళనాడు - కర్ణాటక జలవివాదం సుప్రీంకు వెళ్లడం, ఈ విషయంపై సుప్రీం స్పందించడం తెలిసిందే. ఈ విషయాలపై తమిళనాడుకు పదిహేనువేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలా సుప్రీం ఉత్తర్వులు జారీచేయడంపై కర్ణాటక మొత్తం భగ్గుమంది. ఈ సమయంలో ఈ కావేరీ నదీ జలాల విషయంపై కన్నడ నటులు కూడా ఆందొళనకు దిగారు. అయితే.. ఈ ఆందోళనలను ఒక యువకుడు ఎద్దేవా చేయడంతో.. అతడికి చేదు అనుభవంం ఎదురైంది.
కావేరీ జలాల విషయంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి, రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను చేపట్టాయి. ఈ సమయంలో కన్నడ నటులు శివరాజ్ కుమార్ - దునియా విజయ్ - దర్శన్ - రాగిణి ద్వివేది లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని తప్పుపడుతూ ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి డి. సంతోష్ తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అతని పోస్టు ఇప్పుడు కర్ణాటకలో వైరల్ గా మారింది. దీంతో ఆ పోస్ట్ పై ఆగ్రహించిన బెంగళూరు స్థానిక యువకులు కొందరు అతన్ని వెతికిమరీ పట్టుకుని, కాలేజీ గేటు వద్ద అతన్ని అటకాయించి చితకబాదారు. ఐదుగురు యువకులుఅతన్ని చుట్టుముట్టి చితకబాదిన సంఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.