Begin typing your search above and press return to search.

శోభనానికి సిద్ధమవుతుండగా నిజం తెలిసి షాక్‌

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 AM GMT
శోభనానికి సిద్ధమవుతుండగా నిజం తెలిసి షాక్‌
X
అంగరంగ వైభవంగా పెళ్లయింది. రెండు రోజుల్లోనే శోభనం. ఎన్నో ఆశలతో ఆ కార్యం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి ఓ విషయం తెలిసి - దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. బెంగళూరుకు చెందిన వ్యక్తికి - ప్రభుత్వ ఉద్యోగినితో 2019 నవంబర్ 24న పెళ్లయింది. గత డిసెంబర్ 15న వారి శోభనానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. దాని కోసం ఎదురెదురు చూస్తున్నాడా భర్త. డిసెంబర్ 13న రాత్రి ఫేస్‌ బుక్ మెసెంజర్‌ లో కొన్ని ఫొటోలు అతనికి వచ్చాయి. వాటిని ఓపెన్‌ చేసి చూస్తే.... తన భార్య - వేరే వ్యక్తితో 'అతి సన్నిహితంగా' మెలిగిన దృశ్యాలు కనిపించాయి. దాంతో పాటే ఓ ఫోన్ నెంబర్‌ కూడా ఉంది. బాధిత భర్త ఆ నెంబర్‌కు వరుణ్ ఫోన్‌ చెయ్యగా... ఓ వ్యక్తి మాట్లాడాడు. నీ భార్య నాకు లవర్‌ అన్నాడు. అంతేకాదు, తామిద్దరూ ఏడేళ్ల నుంచి 'ఎంతో ఘాడంగా' ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఎంగేజ్‌ మెంట్ అయ్యాక కూడా తనతో శారీరక సుఖం కోసం ఆమె వచ్చిందని వెల్లడించారు. దానికి సాక్ష్యంగా వాట్సాప్‌లో ఓ వీడియో పంపాడు. నిజంగానే అందులో అతని భార్య ప్రైవసీ దృశ్యాలు ఉన్నాయి. ఇక పెళ్లికి ముందు - తర్వాత కూడా తనతో చేసిన వాట్సాప్‌ చాట్ల స్క్రీన్‌ షాట్లు కూడా పంపాడు. ఇవన్నీ చూసేసరికి సదరు భర్తకు పిచ్చెక్కిపోయింది.

కోపంతో ఊగిపోయిన భర్త తన భార్యను నిలదీయగా… ఫోటోలు పంపిన వ్యక్తితో ప్రేమలో ఉన్న మాట నిజమేనని ఒప్పుకుంది. ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నానని, అవసరమైతే విడాకులకు కూడా సిద్దమని భర్త మొహమ్మీదే తేల్చేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి అతన్నే ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే మాత్రం సమాధానం రాలేదు. తాను మోసపోయానంటూ పాపం ఆ బాధిత భర్త... ఆ వీడియో - ఫొటోలు పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లాడు. పోలీసులు భార్య లవర్‌ ని అరెస్ట్ చేశారు.