Begin typing your search above and press return to search.

ఇది బంగ్లాదేశ్ టీమేనా?

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:50 AM GMT
ఇది బంగ్లాదేశ్ టీమేనా?
X
వెస్టిండీస్ ఉంచిన లక్ష్యం 322.. 50 ఓవర్లలో రన్ రేట్ ను మించి ఇన్ని పరుగులు చేయడం అంత సులువైన పని కాదు.. పైగా బంగ్లాదేశ్ లాంటి పసి కూన టీం. ఓటమి ఖాయమే అనుకున్నారంతా.. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది. బంగ్లా బేబీలు బెబ్బులిలా రెచ్చిపోయారు. 322 పరుగులు లక్ష్యాన్ని కేవలం 41 ఓవర్లలోనే చేధించి ఔరా అనిపించారు. బంగ్లాదేశ్ ఆట చూసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అయ్యారు. ఇక నుంచి బంగ్లాను పసికూన అనడానికి వీల్లేదనేలా వీళ్ల ఆట నడిచింది..

బంగ్లాదేశ్ వెస్టిండీస్ బెబ్బులిలానే విరుచుపడింది. వీరి ట్రాక్ సింబల్ అయిన బెంగాల్ టైగర్ ను గుర్తుకు తెచ్చుకున్నారేమోకానీ కేవలం 41 ఓవర్లలోనే పటిష్టమైన వెస్టిండీస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ లక్ష్యాన్ని సాధించడం సంచలనంగా మారింది.

ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ 400 పరుగుల స్కోరునైనా ఛేధించేలా కనిపించింది. ఇంకా 9 ఓవర్లు - 54 బంతులున్నాయి.. 322 పరుగులు చేధించారు. 400కు తక్కువగా ఉన్న 78 పరుగులు చేసి ఉండేవారేమో అన్నంతగా వీరి పరుగుల బీభత్సం కొనసాగింది.

ముఖ్యంగా బంగ్లాదేశ్ గెలుపులో ఆల్ రౌండర్ షకీబుల్ హాసన్ - లిటన్ దాస్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ మైదానంలో వెస్టిండీస్ బౌలర్లను ఆట ఆడుకొని గెలిపించారు.

ఈ గెలుపుతో ఇక బంగ్లాదేశ్ ను ఏ టీం తక్కువగా అంచనావేయడానికి వీల్లేకుండా హెచ్చరికలు పంపారు. ఇక వెస్టిండీస్ గేల్ సహా రస్సెల్ అరవీర భయంకర క్రికెటర్లు ఉన్నా కూడా చిన్న టీంపై ఓడిపోయి అపఖ్యాతి మూటగట్టుకుంది. వెస్టిండీస్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచలేదు.