Begin typing your search above and press return to search.

బక్కెట్ యాడ్ కు బాలకృష్ణ బిల్డప్ ఇచ్చారేంట్రా బాపు..!

By:  Tupaki Desk   |   26 Jan 2023 5:24 PM GMT
బక్కెట్ యాడ్ కు బాలకృష్ణ బిల్డప్ ఇచ్చారేంట్రా బాపు..!
X
కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా.. మార్కెటింగ్ జిమ్మిక్కులు సైతం ఇలానే ఉంటున్నాయి. తమ వస్తువులను అమ్ముకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోరకంగా కుస్తీలు పడుతున్నారు. కొన్ని యాడ్ కంపెనీలు మాత్రం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఎక్కడ లేని బిల్డప్ లు ఇస్తూ మార్కెటింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వీటిలో కొన్ని యాడ్స్ చూసినపుడు అబ్బా భలే బాగా చేశారే అనిపిస్తుంది. మరికొన్ని యాడ్స్ ఏమో నవ్వులు పూయిస్తుంటాయి. అయితే బంగ్లాదేశ్ లో బక్కెట్లు అమ్ముకునే ఓ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇచ్చిన యాడ్ చూస్తే మాత్రం మన తెలుగు సినిమాలో హీరో బాలయ్యకు ఇచ్చే బిల్డప్ గుర్తుకు రాకమానదు.

ఈ యాడ్ చూసిన నెటిజన్లు యాడ్ పై తమదైన శైలిలో సైటర్లు వేస్తున్నారు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. 48 సెకన్ల నిడివిగా ఈ యాడ్ ను బంగ్లాదేశ్ ప్లాస్టిక్ బ్రాండ్ చేయించింది. తమ ప్రత్యర్థుల నుంచి పోటీని తట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేయించేందుకు ఆర్ఎఫ్ఎల్ క్రియేటీవ్ టీంను కలువగా ఓ రేంజులో యాడ్ ను రూపొందించారు.

దీనిని ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్ర ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో బంగ్లాదేశీ ప్లాస్టిక్ బ్రాండ్ ఆర్ఎఫ్ఎల్ బ‌కెట్ ను హీరో చేతిలో పట్టుకొని విల‌న్ గ్యాంగ్‌పై విరుచుకుపడుతుంటాడు. బాలయ్య సినిమాలో కార్లు.. జీపులు ఎలాగైతే గాల్లోకి ఎగురుతాయో అచ్చం అలాగనే ఈ బక్కెట్‌ యాడ్‌లో హీరో కూడా ఒక్క బక్కెట్‌తో రౌడీల భరతం పడుతాడు.

ఆర్ఎఫ్ఎల్ రెడ్ బక్కెట్‌తో కొడితే రౌడీల వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి పేలిపోతుంది. వీడియో చివ‌రిలో ఫైటింగ్‌ పూర్తికాగానే హీరో బ‌య‌ట‌కు వ‌స్తూ త‌న బ‌కెట్ కు థ్యాంక్స్ చెబుతాడు. ఆ తర్వాత ప్రోడ‌క్ట్ గురించిన వివ‌రాల‌తో యాడ్ ముగుస్తుంది. ఈ బంగ్లాదేశ్‌ బ‌కెట్ పేరు యూనిక్ కాగా.. ఇది అత్యంత ధృడ‌మైన బ‌కెట్ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటికే వేలల్లో వ్యూస్‌.. లైకులు సాధించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.