Begin typing your search above and press return to search.
'ఉల్లి' బాంబ్.. బంగ్లాదేశ్ పై పడింది..!
By: Tupaki Desk | 18 Nov 2019 7:40 AM GMTఉల్లి కన్నీళ్లు మనకే కాదు.. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దేశానికి వచ్చాయి. అత్యధిక వర్షాల కారణంగా దేశంలో ఉల్లి అత్యధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈసారి ఉల్లి పంట దెబ్బతింది.దీంతో దిగుమతి రాలేదు. ఈ పరిణామం దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణమైంది. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు రూ.80-100 దాకా కిలోకు పలుకుతున్నాయి. ఢిల్లీ - ఉత్తరాధిన రూ. 150 కిలోకు పైగా పలుకుతోంది.
దేశంలో ఉల్లిధరలు పెరగడంతో కేంద్రం ఎగుమతులను నిషేధించింది. దీంతో మన దేశ ఎగుమతులపైనే ఆధారపడ్డ బంగ్లాదేశ్ ఇప్పుడు విలవిలలాడుతోంది. బంగ్లాదేశ్ లో కిలో ఉల్లి ధర ఏకంగా రూ.220 నుంచి రూ.260 దాకా పెరిగిపోయింది. ప్రజలు ఉల్లిధరల పెరుగుదలపై ఆందోళనలు చేస్తున్నారు.
ఇక దేశంలో ఉల్లి కొరతపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రధాని నివాసంలో ఉల్లి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. దేశ ప్రతినిధులకు ఇచ్చిన విందులో కూడా ఉల్లి వాడకపోవడం చర్చనీయాంశంగా మారింది..
భారత్ ఎగుమతులపైనే ఆధారపడే బంగ్లాదేశ్ ఇప్పుడు తమ దేశ ప్రజల ఉల్లి కష్టాలు తీర్చడానికి రెడీ అయ్యింది. మయన్మార్ - చైనా - టర్కీ - ఈజిప్టుల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. ప్రజల డిమాండ్ ను తీర్చడానికి ఎక్కువ ధర అయినా చెల్లించి కొని ప్రజలకు సరఫరా చేయడానికి అధికారులు రెడీ అయ్యారు.
ఇలా ఉల్లి సంక్షోభం భారత్ నే కాదు.. మనపై ఆధారపడ్డ బంగ్లాదేశ్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.