Begin typing your search above and press return to search.
బంగ్లాదేశ్ అనే దేశముందా...డౌట్ ఎవరిదో తెలుసా?
By: Tupaki Desk | 20 July 2019 6:59 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పరిచయం చేయనవసరం లేదు. ఆయన ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తుంటారు. ప్రజల నోళ్లలో నానుతూ ఉంటారు. తనదైన శైలిలో ఆయన చేసే కామెంట్ల గురించి పరిచయం అవసరం లేదు. తాజాగా, యాజిదీ పౌర హక్కుల కార్యకర్త, నోబెల్ బహుమతి గ్రహీత నదియా మురాద్ ను అవమానపరిచే రీతిలో ప్రవర్తించారు. అక్కడితోనే ఆపేయకుండా, బంగ్లాదేశ్ అనే ఓ దేశం ఉందా? అనే సందేహం వ్యక్తం చేశారు. దీంతో ఓ దేశం ఉందన్న సంగతి తెలియకుండా అమెరికా అధ్యక్ష స్థానంలో ట్రంప్ ఉన్నారా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇరాక్ లో ఐఎస్ చేతుల్లో లైంగిక హింసకు గురవుతున్న ఎంతో మంది యాజిదీ యువతులకు నదియా విముక్తి కల్పించారు. ఒకప్పుడు లైంగిక బానిసగా ఉన్న ఆమె చేసిన ఈ కృషికి గానూ గతేడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. కాగా ఆమె శ్వేతసౌధంలో ట్రంప్ ను కలిశారు. ఇరాక్ లోని యాజిదీలు అనుభవిస్తున్న నరకం, వారి దీనస్థితి గురించి ఆయనకు వివరించారు. తన తల్లి, ఆరుగురు సోదరులు చనిపోయిన విషయం.. 3,000 మంది యాజిదీలు కనిపించకుండా పోయిన సందర్భాన్ని మురాద్ అధ్యక్షుడికి వివరించారు. ఐఎస్, కుర్దు తిరుగుబాటుదారుల చేతుల్లో బలైపోతున్న యాజిదీలకు విముక్తి కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నదియా మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఆమె మాటలకు అడ్డు తగిలారు. 'నీకు నోబెల్ బహుమతి వచ్చిందా? గొప్ప విషయం. అవును అసలు వాళ్లు నీకెందుకు అవార్డు ఇచ్చారు' అంటూ నదియాను ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి కంగుతిన్న నదియా వెంటనే తేరుకుని... ఐఎస్ చేతుల్లో లైంగిక దాడులకు గురైన బానిసలకు విముక్తి కలిగించినందుకుగానూ ఆఫ్రికా గైనకాలజిస్ట్ డెనిస్ ముక్వేజ్ తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి పొందినట్టు తెలిపారు.
ఈ సందర్భంగానే ఐసిస్ నుంచి ప్రజలను కాపాడేందుకు అమెరికా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారని నదియా ప్రశ్నించగా.... ట్రంప్ ఒకింత అయోమయంతో బంగ్లాదేశ్ ఎక్కడుందని ప్రశ్నించారు. దీంతో ఆశ్చర్యపోవడం నదియా వంతయింది. ఇదే సమయంలో ట్రంప్ పక్కన ఉన్న ఆయన సహాయకులు, మయన్మార్ సమీపంలో బంగ్లాదేశ్ ఉందని తెలిపారు. ఆ దేశంలో ఐసిస్ ఉగ్రవాదం పెరిగిపోతోందని తెలిపారు. కాగా, ఏకంగా ఓ దేశం ఉందన్న సంగతి కూడా తెలియకుండా డొనాల్డ్ ట్రంప్...ఏ విధంగా అగ్రరాజ్యం అధిపతిగా ఉన్నారా అంటూ పలువురు సహజంగా సెటైర్లు వేస్తున్నారు.