Begin typing your search above and press return to search.
ఆ దేశంలో న్యూఇయర్ వేడుకలు బంద్
By: Tupaki Desk | 21 Dec 2016 7:10 AM GMTనూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో న్యూఇయర్ ను అద్భుతరీతిలో సెలబ్రేట్ చేసుకుంటారు. భారత్ లో ఈవెంట్స్ తో రిసార్టులు - స్టార్ హోటళ్లు - పర్యాటక ప్రాంతాలు గానాబజానా - మందు - విందు - చిందుతో హోరెత్తిపోతాయి. నిన్నమొన్నటి వరకు బంగ్లాదేశ్ లో కూడా ఇలానే న్యూఇయర్ వేడుకలు జరిగేవి. అయితే ఈ ఏడాది ఇలాంటి వేడుకలను నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ హోం శాఖామంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ ఆదేశాల ప్రకారం నూతన సంవత్సర వేడుకలను నిషేధించిందని ఆ దేశం నిషేధించింది. ప్రజలు గుంపులు గుంపులుగా కలుసుకోవడం - బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఇంట్లో వేడుక నిర్వహించుకోవాలనుకుంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు తరువాత క్లబ్బులు - పబ్బులు మూసేయాలని - ఎటువంటి బాణాసంచా కాల్చరాదని ఆయన తెలిపారు. న్యూఇయర్ రోజును పురస్కరించుకుని యువత చట్టాలను అతిక్రమంచి చేయరాని పనులు చేస్తున్నారని, వాటిని నిరోధించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని బంగ్లాదేశ్ హోం శాఖామంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ తెలిపారు. ఆ రోజు బంగ్లాదేశ్ లోని ప్రధాన పట్టణాల్లో గస్తీ పెంచుతామని ఆయన తెలిపారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/