Begin typing your search above and press return to search.

తలసరి ఆదాయంలో భారత్‌ను మించిన బంగ్లా !

By:  Tupaki Desk   |   22 May 2021 5:30 AM GMT
తలసరి ఆదాయంలో భారత్‌ను మించిన బంగ్లా !
X
తలసరి ఆదాయం విషయంలో భారత్‌ ను పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ సాంకేతికంగా అధిగమించింది. ఓ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2020-21 ఆర్థిక ఏడాదిలో 2,227 డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకుముందు ఏడాది అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,064 డాలర్లుగా ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరం బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 9% మేరకు పెరిగింది. అదే సమయంలో భారత్ తలసరి ఆదాయం 1,947.417 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి, గత ఏడాది సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీనితో ఆదాయం కొంతమేర తగ్గింది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన్ నేతృత్వంలో జరిగిన వర్చువల్ కేబినెట్ సమావేశంలో ప్లానింగ్ మినిస్టర్ ఎంఏ మన్నన్ డేటాను ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పర్ క్యాపిడా ఇన్‌ కం 2,227 డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది 2,064 డాలర్లుగా నమోదయింది. తలసరి ఆదాయం ఈ ఏడాది కాలంలో 9 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇది కేవలం తాత్కాలిక అంశమని, బంగ్లాదేశ్ లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతులు ఎక్కువగా కలిగినదని, ఇది ఎక్కువ కాలం ఇదే వృద్ధిని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

భారత్ కంటే వేగంగా వృద్ధి ఉండకపోవచ్చునని, ఒకసారి కరోనా తగ్గుముఖం పడితే వృద్ధిలో మార్పులు ఉంటాయని, కరోనా నేపథ్యంలో కొన్ని పాలసీలతో భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలకు విలువనిచ్చి గత ఏడాది ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్ డేటా ప్రకారం బంగ్లాదేశ్ తలసరి ఆదాయంలో భారత్‌ ను వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఫార్మర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఈ రెండు దేశాల వృద్ధి డేటాలను పోల్చలేమన్నారు.