Begin typing your search above and press return to search.

ఇండియాకు తోడుగా ఉంటానన్న బంగ్లా

By:  Tupaki Desk   |   21 Sep 2016 9:38 AM GMT
ఇండియాకు తోడుగా ఉంటానన్న బంగ్లా
X
యూరీలో ఉగ్రదాడితో మన సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ పై యుద్ధం చేయాలని సైనికులు ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారు. పాకిస్థాన్ పని పట్టేయాలని అంటున్నారు. నిజంగా పాకిస్థాన్ తో భారత్ యుద్ధం తాము భారత్ కే మద్దతిస్తామని మరో పాకిస్థాన్ ప్రకటించింది... కన్ఫ్యూజన్ ఆ మరో పాకిస్థాన్ బంగ్లాదేశ్. అవును... ఒకప్పుడు ఈస్ట్ పాకిస్థాన్ గా ఉంటూ పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడిన ఈ దేశం తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ కు తన మద్దతును ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. అన్ని దేశాలూ ఏం జరుగుతుందా అని ఆచి తూచి స్పందిస్తున్న సమయంలో ఈ రోజు బంగ్లాదేశ్ సంచలన ప్రకటన చేసింది. పాక్ తో కనుక భారత్ యుద్ధం చేస్తే తాము భారత్ పక్షాన నిలుస్తామని ప్రకటించింది.

యూరీలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసద్ జమాన్ ఖాన్ కమాల్ - పాక్ పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ లా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతూ - పొరుగు దేశాలపైకి వారిని పురిగొల్పే ఏ దేశమైనా బంగ్లాదేశ్ కు శత్రువేనని స్పష్టం చేశారు. 1971 నుంచి ఇండియాతో తమ స్నేహ బంధం కొనసాగుతోందని గుర్తు చేసిన ఆయన, తమ పూర్తి మద్దతు ఇండియాకేనని వివరించారు. భారత్ - పాకిస్థాన్ ల మధ్య యుద్ధం సంభవిస్తే, తాము ఇండియా వెనుకే నిలబడి మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

దీంతో భారత్ తో యుద్ధం వచ్చినా తమకేమీ భయం లేదంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ కాస్ల వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ వంటి దేశమే అంత డైరెక్టుగా ఈ విషయంపై స్పందించినప్పడు మిగతా దేశాలూ కచ్చితంగా దీనిపై భారత్ పక్షాన మాట్లాడే పరిస్థితులున్నాయి. దీంతో యుద్ధం మాట పక్కనపెట్టినా పాక్ ఒంటరిగా మిగిలే ప్రమాదం ఉండడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితులున్నాయి.