Begin typing your search above and press return to search.

బెంగళూరు వాసుల్లో ఆ బలహీనత ఎక్కువట

By:  Tupaki Desk   |   22 Nov 2019 7:22 AM GMT
బెంగళూరు వాసుల్లో ఆ బలహీనత ఎక్కువట
X
అప్పు చేసి పప్పుకూడు తినటం గతంలో మహాపరాధం. అలాంటి తీరును అస్సలు తట్టుకునే వారు కాదు. గంజి తాగి అయినా ఓకే.. అప్పు మాత్రం వద్దన్నట్లుగా ుండే మైండ్ సెట్ ఇటీవల కాలంలో చాలా మారింది. అయితే.. దేశంలో మరే నగరంలో లేని రీతిలో అప్పులు తీసుకోవటంలో బెంగళూరు నగర ప్రజలు ఉన్నంత ముందు మరెక్కడా లేదంటున్నారు.

తాజాగా హోం క్రెడిట్ ఇండియా సంస్థ ఒక సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఇందులో రుణాలు ఎక్కువగా తీసుకునే నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవటం గమనార్హం. రుణాలు తీసుకునే ప్రవృత్తి బెంగళూరు ప్రజల్లో ఎక్కువంటున్నారు.

తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం చేతిలో డబ్బులు లేకున్నా బెంగళూరుకు చెందిన 40 శాతం మంది అప్పులు చేసేసి బండి నడిపిస్తారని చెబుతున్నారు. అప్పు అయినా ఫర్లేదు.. అనుకున్న వస్తువును కొనుగోలు చేశామన్న సంతోషంతో ఉంటారంటున్నారు. కావాల్సిన వస్తువును సొంతం చేసుకోవటానికిజేబులో డబ్బులు లేకున్నా.. వెనకడుగు వేయరని.. అప్పులు చేసేస్తారని పేర్కొంది.
దేశంలోని ప్రధాన నగరాలైన నాగపూర్.. లక్నో.. ఇండోర్.. జైపూర్.. ఛండీగఢ్.. అహ్మదాబాద్.. కోల్ కతా.. ముంబయి.. చెన్నై నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. మరెక్కడా లేని రీతిలో అప్పు బలహీనతలో బెంగళూరు వాసులు ఎక్కువగా ఉంటారని తేల్చారు. దేశంలో రుణాలు పొందే ప్రవృత్తి ఉన్న 12 నగరాల్లోని 2517 మంది ప్రజల మీద జరిపిన సర్వేలో బెంగళూరు ప్రజలు అప్పు చేసి పప్పుకూడుకు సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారని తేల్చింది.