Begin typing your search above and press return to search.
అఖిలప్రియకు ఇంతకంటే అవమానం ఉంటుందా?
By: Tupaki Desk | 14 Dec 2022 12:40 PM GMTఅప్పల వాళ్లు వచ్చి ఇంటి మీద పడి నానా యాగీ చేస్తుంటే.. చుట్టుపక్కల జనాలు అంతా చూస్తుంటే తల కొట్టేసినంత పని అవుతుంది. అంతకంటే అవమానం మరొకటి ఉండదు. అలాంటి అవమానాన్ని.. మాజీ మంత్రి అఖిల ప్రియ స్వయంగా అనుభవించారు. అప్పులు ఎగ్గొట్టినందుకు బ్యాంకు వారు చేతుల్లో దారుణ పరాభవానికి గురయ్యారు.
భూమా నాగిరెడ్డి బతికున్న రోజుల్లో నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకొని ‘జగత్ డెయిరీ’ ప్రారంభించారు. ఇందుకు గాను తమ 80 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకు తాకట్టు పెట్టారు. ఆయన ఉన్నన్నీ రోజులు వ్యాపారాలు, ప్రతీ నెలా బ్యాంకు రుణాలు చెల్లించారు.
కానీ భూమా నాగిరెడ్డి చనిపోయాక అఖిలప్రియ మంత్రి కావడం.. అప్పులన్నీ ఎగ్గొట్టడం.. దాడులు, దౌర్జన్యాలు, స్థలాల కోసం కిడ్నాపులు చేసింది. హైదరాబాద్ లో కేసీఆర్ బంధువుల అంటూ జరిగిన ఓ కిడ్నాప్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ కూడా అయ్యి జైలు పాలైంది. అప్పటి నుంచి లోప్రోఫైల్ మెయింటేన్ చేస్తోంది. ఇక కర్నూలులోనూ అఖిలప్రియ భర్త ఓ క్రషర్ యజమానిని బెదిరించి అతడిపై దాడి చేసి ఆ స్థలం కబ్జా ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ఇలా మూడు దాడులు, ఆరు కిడ్నాప్ అంటూ సాగిన వీరి వ్యవహారంలో బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించడం ఎగ్గొట్టారు. ‘జగత్ డెయిరీ’ పేరిట తీసుకున్న మొత్తం రుణం దాదాపు 16 కోట్లకు చేరింది. దీంతో ‘యూనియన్ బ్యాంక్’ అధికారులు అఖిలప్రియకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆమె స్పందించలేదు. బ్యాంకు రుణం తీర్చలేదు.
దీంతో విసిగి వేసారిన బ్యాంకు ఉద్యోగులంతా కూడా అఖిలప్రియపై ప్లకార్డులు రాసుకొని ఆమె పరువు తీసేలా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ఎదురుగా బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఇది సంచలనమైంది. అఖిలప్రియ పరువు తీసేసింది. ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ.. మా బకాయిలు చెల్లించండి.. సగర్వంగా జీవించండి.. అంటూ నినాదాలు రాసుకొని వచ్చి ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు.
దీంతో దెబ్బకు పరువు పోతుందని భావించిన అఖిలప్రియ బ్యాంకు అధికారులను ఇంట్లోకి పిలిచి కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం. ఇక అఖిలప్రియ టీడీపీ పరువు పోయే పనులు చేస్తుండడంతో అధిష్టానం ఇప్పటికే గుర్రుగా ఉందని.. ఈ సెటిల్ మెంట్లు ఆపకపోతే ఆమెకు పార్టీలో కష్టం అని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.