Begin typing your search above and press return to search.
బ్యాంకర్లపై బాబు విమర్శలు బెడిసికొట్టాయి
By: Tupaki Desk | 30 Nov 2016 5:05 AM GMTపెద్ద నోట్ల రద్దు - తదనంతర పరిస్థితులపై జరిగిన సమీక్షలో బ్యాంకర్ల వల్లే అవస్థలు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో పరిస్థితి చక్కబడటం పక్కనపెడితే బ్యాంకు ఉద్యోగులు బాబు తీరుపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏకంగా నిరసన తెలియజేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కృష్ణాజిల్లా బ్యాంకర్ల సంఘం నాయకులు స్పందించారు. డబ్బు చెల్లింపు విషయంలో ప్రభుత్వాల వైఫల్యాలను తమపై రుద్దుతున్నారని చంద్రబాబు తీరుపై బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గరకు వచ్చిన డబ్బును వచ్చినట్లు ఇచ్చేస్తున్నామని, అయినా ముఖ్యమంత్రి తమను మనో వేదనకు గురి చేస్తున్నారని మీడియాకు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడాలని తాము కోరుకోవడం లేదని, డబ్బు లేదని కేంద్రం చెబుతుంటే తాము ఇవ్వలేదనే విధంగా సీఎం ప్రచారం చేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాబు ఆగ్రహం నేపథ్యంలో బ్యాంకర్ల సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద డబ్బు మిగులు లేదని, బ్యాంకులకు ఆర్ బీఐ పంపించిన డబ్బును పంపినట్లు ఇచ్చేస్తున్నామని చెప్పారు. అయినా సీఎం స్థాయిలో ఉండి తప్పంతా బ్యాంకర్లదేనన్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారని, నిరంతరం రివ్యూలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుండి ఎంత మొత్తం వచ్చింది అనేది చెప్పకుండా తామేదో దాచుకున్నట్లు సీఎం చంద్రబాబు మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆర్‌బీఐ ఎంత నిధులు ఇచ్చింది, తామెంత పంపిణీ చేశామో చంద్రబాబు చెప్పాలని, అపుడు ఎక్కడ లోపం ఉందనేది తేలుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సెలవులు కూడా మానుకుని రేయింబవళ్లు సేవలందించారని, అటువంటి విషయాన్ని మరుగునపెట్టి ప్రభుత్వమే ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించేందుకు తమపై అభాండాలు వేయడం సరికాదని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇదే పరిస్థితి కొనసాగిస్తే తాము నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్రంలో బ్యాంకర్ల వల్లే ఇబ్బందులున్నట్లు చెప్పడం సరికాదని బ్యాంకర్లు వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/