Begin typing your search above and press return to search.

ఖాతాల్లో డబ్బు పోతే బ్యాంకులే ఇవ్వాలిక..

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:30 PM GMT
ఖాతాల్లో డబ్బు పోతే బ్యాంకులే ఇవ్వాలిక..
X
బ్యాంకుల్లో డబ్బులు మాయం అవుతున్నాయి.మనకు సంబంధం లేకుండానే.. మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా డబ్బులు కాజేస్తున్నారు. బ్యాంకుకు వెళితే పట్టించుకోవడం లేదు. కానీ మన ప్రమేయం లేకుండా మన ఖాతాలో డబ్బు మాయం అయితే పూర్తి బాధ్యత బ్యాంకుదేనని.. ఆ మాయమైన డబ్బును రీఫండ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకులదేనని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

కస్టమర్ ప్రమేయం లేకుండా.. అతడు ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వకుండా అతడి బ్యాంకు ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తే అందుకు పూర్తి బాధ్యత బ్యాంకుదేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆ బ్యాంకులు కస్టమర్ కు అంతే మొత్తం తిరిగి ఇవ్వాలని పేర్కొంటున్నారు.

తాజాగా సైబారాబాద్ పరిధిలో నెలకిందే ఉద్యోగంలో చేరిన వెంకటేశ్ అనే ఉద్యోగి తొలి జీతం 40వేల డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అతడు ఎవరికి ఓటీపీ చెప్పలేదు. కొత్త ఏటీఎంను వాడలేదు.. లీక్ చేయలేదు. అయినా సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలోని 40వేలను ‘స్కిమ్మింగ్ ’ అనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా బ్యాంకు లోపాలను గుర్తించి కాజేశారు. బ్యాంకుల్లో కొంత మంది సిబ్బంది, ఏటీఎం సెంటర్లలో నిఘా లోపం వల్ల సైబర్ నేరగాళ్లు స్కిమ్మింగ్ యంత్రాలతో డేటా చోరీకి పాల్పడి వినియోగదారుల సొమ్ములు కాజేస్తున్నారు. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బ్యాంకు చెల్లించాలని పోలీసులు కోరిన మేరకు అతడికి యాక్సిక్ బ్యాంకు రూ.40వేలు తిరిగి ఇచ్చింది.

మన ప్రమేయం లేకుండా సైబర్ నేరగాళ్లు ఖాతాలో డబ్బులు కాజేస్తే ఆ ఆధారాలను బ్యాంకుకు అందజేస్తే బ్యాంకు రీఫండ్ చేయాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రైవేట్ బ్యాంకులు ఇలా రీఫండ్ చేస్తున్నా.. ప్రభుత్వ బ్యాంకులు మాత్రం వినియోగదారులను గోడును పట్టించుకోవడం లేదు.