Begin typing your search above and press return to search.
బ్యాంకులకు బురిడీ.. మూల్యం రూ.2లక్షల కోట్లు!
By: Tupaki Desk | 13 Jun 2019 6:15 AM GMTబ్యాంకుల్ని మోసం చేయటం సాధ్యమా? అంటే.. అదెలా అనేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. బ్యాంకుల్ని మోసం చేసి ఏకంగా రూ.2లక్షల కోట్లు దోచేసిన వైనం చూస్తే షాక్ తినక తప్పదు. గడిచిన 11 ఏళ్లలో ప్రజాధనం ఎంతలా పక్కదారి పట్టిందన్న విషయం ఈ ఉదంతం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
బ్యాంకుల్లోని లోపాల్ని అసరా చేసుకొని భారీగా మోసం చేసే తీరు విలువ చూస్తే గుండెలవిసిపోవాల్సిందే. తాజాగా ఆర్టీఐ కింద ఒకరు ఒక అప్లికేషన్ పెట్టారు. అందులో.. మోసం కారణంగా బ్యాంకులు నష్టపోయిన విలువ ఎంతో చెప్పాలని కోరారు. దీంతో.. ఆ వివరాల్ని ఆర్ బీఐ విడుదల చేసింది. 2008 నుంచి 2019 వరకు మొత్తంగా 53,334 కేసులు నమోదు అయితే.. పలు బ్యాంకులు కలిసి నష్టపోయిన మొత్తం అక్షరాల రూ.2.05 లక్షల కోట్లు.
ఇలా మోసపోయిన వారిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ బ్యాంకు నష్టపోయిన మొత్తం రూ.28,700 కోట్లు. తర్వాతి స్థానంలో బ్యాంక్ బరోడా నిలిచింది. ఈ బ్యాంకు ఏకంగా రూ.12,962 కోట్లు నష్టపోయింది.
మొదటి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు మోసపోయిన విలువ ఏకంగా రూ.లక్ష కోట్లకు పైనే ఉండటం గమనార్హం. ఇక.. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ నిలిచింది. ఈ బ్యాంకు గడిచిన 11 ఏళ్లలో రూ.5.03వేల కోట్లు నష్టపోయింది. అన్నింటి కంటే అతి తక్కువ మొత్తం నష్టపోయిన బ్యాంకుగా పేటీఎం నిలిచింది. కేవలం రూ.2లక్షలు మాత్రమే నష్టపోయింది. మోసం చిన్నదైనా పెద్దదైనా వివిధ బ్యాంకులు ఇంత భారీగా నష్టపోవటం గమనార్హం. మోసాగాళ్ల బారిన ప్రభుత్వ.. ప్రైవేటు బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు కూడా నిలిచాయి. అయితే.. ప్రభుత్వ బ్యాంకులు భారీగా.. ప్రైవేటు బ్యాంకులు ఒక మోస్తరుగా.. విదేశీ బ్యాంకులు తక్కువగా మోసపోయాయి.
మోసాల కారణంగా బ్యాంకుల వారీగా నష్టపోయిన మొత్తం చూస్తే..
బ్యాంకు కేసులు మొత్తం (రూ.కోట్లలో)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2,047 28,700.74
బ్యాంక్ ఆఫ్ బరోడా 2,160 12,962.96
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1,115 12,644.70
బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,872 12,358.20
యూనియన్ బ్యాంక్ 1,244 11,830.74
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,613 9,041.98
యూకో బ్యాంక్ 1,081 7,104.77
ఐడీబీఐబ్యాంక్ 1,264 5,978.96
సిండికేట్ బ్యాంక్ 1,783 5,830.85
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 1,040 5,598.23
కెనరా బ్యాంక్ 1,254 5,553.38
యాక్సిస్ బ్యాంక్ 1,944 5,301.69
ఐసీఐసీఐ 6,811 5,033.81
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ 944 3,052.34
విజయా బ్యాంక్ 639 1,748.90
జమ్ముకశ్మీర్ బ్యాంక్ 142 1,639.90
స్టాండర్ట్ ఛార్టర్డ్ బ్యాంక్ 1,263 1,221.41
స్టేట్ బ్యాంక్ ఆఫ పటియాలా 386 1,178.77
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 276 1,154.89
లక్ష్మీ విలాస్ బ్యాంక్ 259 862.64
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 395 742.31
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ 274 694.61
ద ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా(9) 671.66
తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ 261 493.92
కోటక్ మహీంద్ర 1,213 430.46
ధనలక్ష్మి బ్యాంక్ 89 410.93
యస్ బ్యాంక్ 102 311.96
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2 000.02
విదేశీ బ్యాంకులు
సిటీ బ్యాంక్ 1,764 578.09
హెచ్ ఎస్ బీసీ 1,173 312.10
ద రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ 216 12.69
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ 1,862.8 6.21