Begin typing your search above and press return to search.
వాత మీద మరో మోత: ఇవాళ మార్పిడి వాళ్లకే..
By: Tupaki Desk | 19 Nov 2016 4:24 AM GMTఉపవాసంతో నీరసించి.. దాన్ని విడిచే వేళకు తినాల్సిన కాస్త.. తినలేని పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది? ఒళ్లు మండిపోతుంది. ఉపవాసంతో వచ్చే పుణ్యం మాటేమో కానీ.. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందే అన్న భావన కలగటం ఖాయం. నోట్ల రద్దు ఎపిసోడ్ లో బ్యాంకు క్యూ లైన్లలో నిలబడి.. నిలబడి ఓపిక లేని జనాలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు చుక్కలు కనిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న వరకూ రోజుకు రూ.4500 వరకూ నగదు మార్పిడిని అప్పటికప్పుడు చేసుకునే వీలున్న స్థానే.. దాన్ని రూ.2వేలకు కుదించిన వైనం తెలిసిందే. నోట్ల కోసం ఉన్న ఆఫీసుకు వెళ్లకుండా బ్యాంకుల చుట్టూ తిరిగితే కష్టమని అర్థమైన జనాలు.. వారాంతపు వేళ బ్యాంకులకు వెళదామని ఫిక్స్ అయిన వారికి సినిమా చూపించేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.
బ్యాంకుల్లో నగదు మార్పిడి కోసం ఈ రోజు (శనివారం) దేశ వ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఎందుకలా అంటే.. నగదు మార్పిడి కారణంగా క్యూ లైన్లలో నిలుచునే వీలు లేక వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. వారికి అలాంటి ఇబ్బంది కలగకుండా చేయటం కోసం.. ఈ రోజు కేవలం వృద్ధులకు మాత్రమే నగదు మార్పిడి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
నగదు మార్పిడి మినహా మిగిలిన బ్యాంకింగ్ సేవల్ని యథావిధిగా కల్పిస్తున్నారు. నగదు మార్పిడి కోసం వస్తున్న వారిలో సిరా గుర్తు పెట్టటం వల్ల నగదు మార్చుకునేందుకు వస్తున్న రద్దీ 40 శాతం తగ్గినట్లుగా బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ రాజీవ్ రుషి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నగదు మార్పిడి కోసం ఇప్పటివరకూ బ్యాంకులకు వచ్చినవారుచాలా తక్కువ శాతమన్న విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకు క్యూ లైన్లకు బెదిరి.. చాలామంది చేబదులు తీసుకొని బండి లాగిస్తున్నారు. మరికొందరు ఆశావాహ దృక్ఫదంతో బ్యాంకు క్యూ లైన్లు వారం రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయికాబట్టి అప్పుడు వెళ్లి నగదు మార్పిడి చేయాలని భావించిన వారూ ఉన్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పనట్లే. ఎందుకంటే.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని దాదాపు పది రోజులు గడిచిపోయి.. రెండు వారాల్లోకి వెళ్లిపోతున్న వేళ.. చేతిలో ఉన్న కాసిన్ని చిన్ననోట్ల కాస్తా అయిపోవటంతో బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏకంగా రెండు రోజులు (ఇవాళ.. శనివారం.. రేపు ఆదివారం) నగదు మార్పిడికి మార్గం లేకపోవటం (ఈ రోజు వృద్ధులకు మాత్రమే ఉండటం.. రేపు ఆదివారం బ్యాంకులకు సెలవు)తో చుక్కలు కనిపించటం ఖాయమంటున్నారు. వాత మీద మోత అంటే ఇలానే ఉంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/