Begin typing your search above and press return to search.
సబ్బం ఆస్తులు సీజ్ చేశారా ?
By: Tupaki Desk | 9 Sep 2022 5:30 AM GMTవిశాఖ మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి ఆస్తులను బ్యాంకులు సీజ్ చేసినట్లు సమాచారం. మొన్నటి కరోనా వైరస్ బాగా ఉధృతంగా ఉన్న సమయంలోనే హరి మరణించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఆస్తుల కొనుగోలు కోసం సబ్బం బ్యాంకులో చేసిన అప్పులు తీర్చనందుకు ఇపుడు కొన్ని ఆస్తులను సదరు బ్యాంకు సీజ్ చేసిందట. అప్పులు, వేలంపాట, ఆస్తుల సీజ్ వ్యవహారం కాస్త అయోమయంగానే ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ నగరంలో ప్రముఖ మీడియా సంస్ధ డెక్కన్ క్రానికల్ కు పెద్ద భవనం ఉంది. తమ దగ్గర తీసుకున్న అప్పు తీర్చనందుకు సదరు భవనాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు 2014లో వేలం వేసింది. ఆ వేలంలో పాల్గొన్న సబ్బం ఆ భవనాన్ని రు. 17.8 కోట్లకు సొంతం చేసుకున్నారు.
ఆ డబ్బులు చెల్లించేందుకు సబ్బం తన ఆస్తులను తాకట్టుపెట్టి విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు నుండి రు. 8.5 కోట్లు అప్పు తీసుకున్నారు. మిగిలిన డబ్బును కూడా జమ చేసి మొత్తాన్ని కోటక్ మహీంద్రాబ్యాంకు సబ్బం చెల్లించారు.
అయితే తమ ఆస్తులను వేలంవేయటంలో మహీంద్రాబ్యాంకు సరైన పద్దతిని అనుసరించలేదని చెప్పి డెక్కన్ క్రానికల్ యాజమాన్యం డెట్ రికరవీ అప్పీలేట్లో కేసు వేసింది. పిటీషన్ను విచారించిన అథారిటి వేలంపాటను రద్దుచేసింది.వేలంపాట రద్దయ్యింది కాబట్టి తన పరిస్ధితి ఏమిటని సబ్బం కూడా విచారణలో ఇంప్లీడ్ అయ్యారు. దాంతో సబ్బం వాదనను విన్న అథారిటి వేలంపాట రద్దయ్యింది కాబట్టి సబ్బం కట్టిన డబ్బు మొత్తాన్ని తిరిగి వాపసుచేయాలని మహీంద్రబ్యాంకును ఆదేశించింది.
అయితే బ్యాంకు సబ్బంకు డబ్బు వాపసు ఇవ్వకుండానే వేలం పాటను రద్దు చేసిన అథారిటి తీర్పుకు వ్యతిరేకంగా మహీంద్రా బ్యాంకు నేషనల్ కంపెనీ లాబోర్డులో కేసు వేసింది. అప్పటినుండి కేసు ఇంకా పెండింగులోనే ఉంది. అంటే వేలంపాట ప్రక్రియ పూర్తికాలేదు. కాబట్టి సదరు భవనాన్ని బ్యాంకు సబ్బంకు స్వాధీనం చేయలేకపోయింది. పూర్తిడబ్బు కట్టేసినా భవనం స్వాధీనం కాకపోవటంతో సబ్బంది దిక్కుతోచలేదు. ఎందుకంటే ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు కాబట్టి తమ అప్పు తీర్చమని కోఆపరేటివ్ బ్యాంకు సబ్బం వెంటపడింది.
ఇంతలో కరోనా కారణంగా సబ్బం చనిపోయారు. ఇక సబ్బం అప్పు తీర్చే మార్గం లేదని అనుకున్న బ్యాంకు తమ దగ్గర తనఖా పెట్టిన ఆస్తులను జప్తుచేసుకునే నిమిత్తం సబ్బం కుటుంబానికి నోటీసులు ఇచ్చిందట. మొత్తానికి డెక్కన్ ఆస్తుల వేలంపాట వ్యవహారం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.