Begin typing your search above and press return to search.
బ్యాంకుల కొత్త షాక్..పన్నులపై కూడా జీఎస్టీ
By: Tupaki Desk | 12 May 2018 6:40 AM GMTకారణాలు ఏమైతేనేం...పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు అంటేనే బెంబేలెత్తే పరిస్థితులు తలెత్తాయి. బ్యాంకుల వైపు చూడాలంటేనే...వినియోగదారులు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఇంకో షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. అదే...బ్యాంకులు తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న వివిధ రకాల సేవలపై వస్తు - సేవల పన్ను (జీఎస్టీ)ను విధించే అంశం. ఈ విషయంపై గందరగోళం నెలకొంది. దీంతో ఈ గందరగోళాన్ని తొలగించేందుకు రెవెన్యూ విభాగాన్ని ఆశ్రయించాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ ఎస్) నిర్ణయించుకుంది.
మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఖాతాదారులకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన శ్లాబ్ ను ఆఫర్ చేస్తూ దాని ఆధారంగా ఉచిత సేవలను అందజేస్తున్న విషయం తెలిసిందే. 2012 జూలై నుంచి గత ఏడాది జూన్ వరకు చెల్లించని సేవాపన్నును వడ్డీ - అపరాధ రుసుముతో కలపి చెల్లించాలని ఆదేశిస్తూ డీజీజీఎస్ టీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్) ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ - హెచ్‌డీఎఫ్ సీ - యాక్సిస్ లాంటి మరికొన్ని ప్రైవేటు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. చెక్ బుక్కులు - అకౌంట్ స్టేట్ మెంట్ల జారీతో పాటు ఏటీఎం విత్ డ్రాయల్స్ వంటి సేవలను కొంత పరిమితి వరకు ఉచితంగా అందజేయాలని, అయితే వ్యాపార కార్యకలాపాలను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమ విభాగం అభిప్రాయపడుతున్నట్లు డీఎఫ్ ఎస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ న్యూఢిల్లీలో వెల్లడించారు. ``బ్యాంకులు తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలపై జీఎస్టీ విధింపు విషయాన్ని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని మేము ఆశిస్తున్నాం`` అని ఆయన తెలిపారు.
బ్యాంకుల యాజమాన్యం తరఫున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ఈ విషయమై పన్నుల విభాగం అధికారులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఖాతాదారులకు బ్యాంకులు ఉచితంగా సేవలను అందజేయడం లేదని, వాస్తవానికి ఖాతాలో కనీస మొత్తాన్ని (మినిమమ్ బ్యాలెన్స్) నిల్వ ఉంచాలని ఖాతాదారులకు సూచిస్తూ వారి నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయని పన్నుల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ - ఆర్థిక సేవల విభాగాలు కలసి ఒకటి రెండుసార్లు చర్చలు జరిపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు.