Begin typing your search above and press return to search.
వైరా మాజీ ఎమ్మెల్యే కొడుకు కమ్ ట్రైనీ ఐఏఎస్ మీద ఆ కేసు!?
By: Tupaki Desk | 22 Oct 2021 5:34 AM GMTషాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత? అన్నది ఇప్పటికిప్పుడు తేలే పరిస్థితి లేదు. అలా అని.. సదరు ప్రముఖుడి ఇలా అంటూ మేం తీర్పులు ఇవ్వటం లేదు. కేవలం.. ఫిర్యాదు ఇవ్వటం.. కేసు నమోదు కావటంతో ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీ ముందుకు తీసుకొస్తున్నాం.కాకుంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రముఖుడు కావటం గమనార్హం. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుమారుడుకమ్ ట్రైనీ ఐఏఎస్ గా ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 30 ఏళ్ల బానోతు మృగేందర్ లాల్ పై ఒక యువతి లైంగిక వేధింపుల కేసును పెట్టారు.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆమె కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మృగేందర్ లాల్ ప్రస్తుతం తమిళనాడులోని మధురైలో శిక్షణ ఐఏఎస్ గా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల్ని చూస్తే.. రెండేళ్ల క్రితం సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్న వేళ.. ఫేస్ బుక్ ద్వారా తనకు పరిచయమయ్యారని కుకట్ పల్లి యువతి పేర్కొన్నారు. అనంతరం తామిద్దరం సన్నిహితులం అయ్యామని.. ఒక రోజు తన తల్లిదండ్రుల్ని ఒప్పించి బయటకు తీసుకెళ్లిన మృగేందర్ లాల్... స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకల్ని నిర్వహించారన్నారు.
ఆ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించినట్లుగా పేర్కొన్నారు. అతని తండ్రి వైరా మాజీ ఎమ్మెల్యేగా ఆమె పేర్కొన్నారు. తన తల్లిని.. తండ్రిని కూడా మృగేందర్ లాల్ బెదిరించారన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ను వివరణ కోరిన మీడియాకు ఆయనో కొత్త విషయాన్ని వెల్లడించారు. బాధితురాలు తమ బంధువేనని చెప్పి.. కేసు గురించి తనకు వివరాలు తెలీవని చెప్పటం గమనార్హం. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. ఈ ఉదంతంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మృగేందర్ లాల్ స్పందించాల్సి ఉంది.