Begin typing your search above and press return to search.
బీజేపీ ఎమ్మెల్యే నోట ‘అంటరానితనం’ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 10 April 2018 8:30 AM GMTరాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడా అసహనం - విభేదాలున్నా కూడా అంటరానితనం వంటివి ఎప్పుడో రూపుమాసిన ఈ దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితులకు పురిగొల్పేలా ఆయన మాట్లాడారు. ముస్లింలను ఎవరూ తమ ఇళ్లలోకి రానివ్వొద్దంటూ తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సింఘాల్ తాజాగా మాట్లాడుతూ.... ‘ముస్లింలు నేరాలు చేస్తారు. వారిని ఎవరూ తమ ఇళ్లలోకి రానివ్వొద్దు’ అన్నారు. తాను కూడా వారిని తన ఇంటిలోకి కాదు కదా ఆఫీసుకు కూడా రానివ్వనని చెప్పారు. 'మియో ముస్లింలు బీజేపీకి ఓటు వేయరు. నేను కూడా వాళ్లను ఓటేయమని అడగను. వాళ్లను ఓటు అడగడమంటే వాళ్లు చేసే నేరాలకు పరోక్షంగా సహకరించడమే. అందుకే ముస్లింలకు నేను వీలైనంత దూరంగా ఉంటా' అని సింఘాల్ అనడం విమర్శలకు దారితీస్తోంది.
ముస్లింలు గోవధ - లవ్ జిహాద్ వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ ఈయన గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని అల్వార్ - భరత్ పూర్ నియోజకవర్గాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న ముస్లింలు.. 'లవ్ జిహాద్' కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మియో ముస్లింలకు ఇదొక ఆచారంలా మారిపోయిందన్నారు. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. మియో ముస్లింలు హిందు అమ్మాయిలను ఆకర్షిస్తున్నారని సింఘాల్ ఆరోపించారు. హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. 'హిందు అమ్మాయిలు టాలెంటెడ్ - ఇంటలెక్చువల్ అయినప్పటికీ సెక్యులర్ గా ఉంటూ మియో ముస్లింలను సైతం పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పెళ్లయిన రెండేళ్లకే వారిని ముస్లిం భర్తలు గెంటేస్తున్నారు. అందుకే ముస్లింలను మీ ఇళ్లలోకి రానివ్వకండి - లవ్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండండి' అని సింఘాల్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సింఘాల్ వ్యాఖ్యలు రాజస్థాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.