Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే-ఎంపీ మధ్యన ఇసుక రచ్చ ముదిరిందా?
By: Tupaki Desk | 30 Oct 2019 2:30 PM GMTబాపట్ల ఎంపీ నందిగాం సురేష్- ఎమ్మెల్యే శ్రీదేవిల మధ్యన ఇసుక రచ్చ ముదిరిందనే వార్తలు వస్తున్నాయి. ఇసుక ర్యాంపులపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ పోటీలు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే సీఆర్డీఏ కు సంబంధించి కూడా వీరిద్దరి మధ్యన విబేధాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
నందిగాం సురేష్ పేరు ఇసుక విషయంలో మొదట్లోనే వినిపించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంతో విలువను ఇస్తే ..ఆయన ఇసుక పంచాయితీలోకి తలదూర్చి చెడ్డపేరు మూటగట్టుకున్నాడనే టాక్ వైసీపీ కార్యకర్తల్లోనే మొదలైంది. ఇక ఎమ్మల్యే శ్రీదేవి కూడా ఇసుక పంచాయితీల్లోకి తలదూర్చినట్టుగా ప్రచారం సాగుతూ ఉంది.
అలా ఎంపీ-ఎమ్మెల్యేల మధ్యలో విబేధాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు స్థానికం గా చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లలోనే ఇలా వీరిద్దరి మధ్యన ఆధిపత్ పోరు కొనసాగుతూ ఉండటం గమనార్హం.
ఒకవైపు ఇసుక కు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తూ ఉన్నాయి. వరదల నేపథ్యంలో ఇసుక కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని నివారించడానికి ముఖ్యమంత్రి శతథా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వైసీపీలోని ఇలాంటి కొంతమంది నేతలు మాత్రం అందుకు సంబంధించి ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. వీరి తీరుపై వైసీపీలోని వర్గాలు కూడా అసహనంతో ఉన్నాయని తెలుస్తోంది.