Begin typing your search above and press return to search.
ఒబామాను ఇలా ఎప్పుడైనా చూశారా
By: Tupaki Desk | 27 Oct 2016 4:44 AM GMTమన నాయకుల్లా ఉండరు చాలా దేశాల అధినేతలు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాగే ఉండాలి అంటూ వాళ్లేం నిబంధనలు పెట్టుకోరు. పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసే విషయంలో వాళ్ల స్టయిలే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా హాట్ టాపిక్ అవుతుంటాయి. తన భార్య మిషెల్లీతో కలిసి ఒబాబా ఉన్న అనేక ఆసక్తికర ఫొటోలు చూసి ఉంటాం. ఇక్కడ చూస్తున్నది వాటన్నింట్లోకి ప్రత్యేకమైంది.
మిషెల్లీతో పెల్లి అనంతరం ఒబామా రిలాక్స్ అవుతున్న ఫొటో ఇది. 1992 అక్లోబరు 3న ఈ ఫొటో తీశారు. చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒబామా.. మిషెల్లీలకు 1989లో పరిచయమైంది. మూడేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కిందట 25వ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. ఒబామా రాజకీయ ప్రస్థానంలో మిషెల్లీది కీలక పాత్ర. మిగతా అమెరికా అధ్యక్షులు-వారి భార్యలతో పోలిస్తే అత్యంత అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకుంది ఒబామా-మిషెల్లీ జంట. త్వరలోనే అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ రానున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ వైట్ హౌజ్ ను ఖాళీ చేయబోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/