Begin typing your search above and press return to search.
ఆ దేశానికి ఒబామా అధ్యక్షుడు కావాలట
By: Tupaki Desk | 27 Feb 2017 4:34 AM GMTఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా రిటైరైన బరాక్ ఒబామాకు అధ్యక్షుడిగా రండీ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు.. ఫ్రాన్స్ ఓటర్లు. తమ దేశానికి అధ్యక్షునిగా పనిచేయాలంటూ వాళ్లు ఒబామాను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఒబామా 17 అనే ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. పారిస్‌లో ఇప్పటికే ఈ ప్రచారం జోరందుకుంది. అధ్యక్షుడిగా ఒబామాను అంగీకరించేవారు ఓ వెబ్‌సైట్‌కు వెళ్లి పిటిషన్ పై సంతకం చేయాలని ఒబామా 17 సృష్టికర్తలు కోరుతున్నారు. మార్చి 15 కల్లా పది లక్షల సంతకాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 27 వేల మందికిపైగా ఈ ప్రచారానికి మద్దతుగా సంతకాలు చేయడం విశేషం. ఈ గెరిల్లా ప్రచారం నినాదం ఎస్ వీ కెన్.
అయితే ఫ్రాన్స్ వాసులు ఎందుకు ఒబామాను తమ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడిగా రెండో విడతను కూడా ఒబామాను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మరి ఆయనను ఎందుకు మన ఫ్రాన్స్ అధ్యక్షుడిగా నియమించకూడదు. ప్రపంచంలో ఈ జాబ్ కు ఒబామాను మించిన వ్యక్తి ఎవరుంటారు? అని ఆ వెబ్‌సైట్ అభిప్రాయపడటం విశేషం. అయితే ఇక్కడ ఒక్కటే సమస్య. ఆయన ఫ్రెంచ్ పౌరుడు కాకపోవడం. అయితే ఆయన ఈ జాబ్‌కు ఆసక్తిగా ఉన్నారని కూడా మేము భావించడం లేదు. ఇది జోక్‌లా అనిపించవచ్చు. అయితే ఫ్రెంచ్ రాజకీయాలలో కాస్త డిఫ్రెంట్ గా ఏంచేయొచ్చో ఈ ప్రచారం ద్వారా ఫ్రాన్స్ ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలను మేలుకొలపడమే ఈ ప్రచార ఉద్దేశం అని ఈ వెబ్ సైట్ సృష్టికర్తలు చెప్తున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఓ విదేశీయుడిని ఎన్నుకొని ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఓ పాఠం నేర్పుదామని ఆ వెబ్ సైట్ పిలుపునిస్తోంది. ఏప్రిల్ 23న ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి తొలి రౌండ్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరు కనీసం 50 శాతం ఓట్లు సాధించలేకపోతే.. మే 7న జరిగే రెండో రౌండ్ ఎన్నికల్లో మళ్లీ పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలిచిన వాళ్లు ఫ్రాన్స్ అధ్యక్షులవుతారు. ఫ్రంట్ నేషనల్ పార్టీకి చెందిన మరైన్ లె పెన్ తొలి రౌండ్‌లో విజయం సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/