Begin typing your search above and press return to search.
ఒబామా కెరీర్ ప్లానింగ్ తెలుసా?
By: Tupaki Desk | 28 Oct 2016 6:27 AM GMT అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తరుణంలో మరో ఆసక్తికర చర్చా జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా తన పదవీకాలం ముగిసాక ఏం చేస్తారు? అధ్యక్ష పదవి చేపట్టి ప్రజా సంక్షేమానికి, దేశానికి శాసనాలు చేస్తూ, అంతర్జాతీయ వేదికపై మహారాజులా వెలిగి ఎనిమిదేళ్లు పాలన సాగించిన ఒబామా భవిష్యత్తు ఎలా ఉండబోతోందని అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
కాగా పదవీకాలం ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో ఒబామా తన భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. అధ్యక్ష పదవి చేపట్టక ముందు న్యాయవాద వృత్తిలో కొనసాగిన ఆయన ఇప్పుడు ఏదైనా కంపెనీకి సలహాదారుగా వ్యవహరించడానికి ప్రయత్నాలు చేయొచ్చని తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీలోని టెక్ సంస్థల్లోకి ఆయన ఎమర్జ్ కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత సంవత్సర కాలంగా ఒబామా ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ దాదాపు 10 సార్లు పలు సాఫ్ట్ వేర్ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఒబామా భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తోంది. అదీకాకుండా ఒబామా వైట్ హౌస్ లో పనిచేసిన ఉన్నతాధికారుల్లో పలువురు ఈ టెక్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం-2008లో ప్రచార రూపకర్త డేవిడ్ ప్లౌఫ్ఫే ఉబెర్ లో - వన్ టైమ్ మీడియా కార్యదర్శిగా పనిచేసిన జే కార్నే అమేజాన్ లో - మాజీ సమాచార సంబంధాల గురువు డాన్ ప్ఫేయ్‌ఫెర్ గో ఫండ్ మీలో - ఒబామా ప్రెసిడెన్సీలో పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలో పనిచేసిన లీసా జాక్సన్ ఆపిల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. వీరంతా ఒబామా ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయంగా విరాళాలు ఇచ్చిన వారే, అదీ కాకుండా ఒబామాకు అత్యంత సన్నిహితులు. వారితో పాటూ ఒబామా పరిపాలనా విభాగంలో సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్స్ చాలా మంది పనిచేశారు.
ఈ నేపథ్యంలో ఒబామా సిలికాన్ వ్యాలీలో పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ ఊహాలకు బలాన్ని చేకూరుస్తూ.. ఈ నెల పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో ఉబెర్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష పరిశోధనలపై జరిగిన కార్యక్రమంలో తనకు తెలిసిన సైన్స్ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఉబెర్ తర్వాతి మార్కెట్ అంతరిక్షమేనన్నారు. ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో క్యాబ్స్ వస్తున్నట్లు - అంతరిక్షంలో వెళ్లాలనుకుంటే ఐదు నిమిషాల్లో ఉబెర్ స్పేస్ షటిల్స్ మీ ముందుంటాయని హాస్యం ప్రదర్శించారు. తన పదవీకాలం ముగుస్తోందని, తాను కూడా ఏదో ఒక పని చూసుకోవాలన్నారు. శక్తివంతమైన మెడికల్ పరికరాలు - అత్యాధునిక బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమలకు అడ్వకేట్ ఇన్ చీఫ్ గా పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఇంకా యువకున్నేనని, హిల్లరీ కంటే ఒక్క సంవత్సరం మాత్రమే పెద్దవాన్ని అని అన్నారు. ఇదిలా ఉండగా, ఒబామా చేరికపై పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/