Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకోవా.. గర్ల్ ఫ్రెండ్ కు ఒబామా రిక్వెస్ట్
By: Tupaki Desk | 4 May 2017 5:30 PM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లవ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. యువకుడిగా ఉన్న సమయంలో ఆయన మంచి విలాసపురుషుడని తేలింది. తన పెళ్లికి ముందు ఓ అమ్మాయికి ఒబామా ప్రపోజ్ చేశారు. అంతేకాదు ఆమెతో కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. ఆ గర్ల్‌ఫ్రెండ్ పేరు షీలా మియోషి జాగర్. ఈ విషయాన్ని తాజాగా రిలీజైన ఓ పుస్తకంలో దాని రచయిత వెల్లడించాడు. రైజింగ్ స్టార్- ద మేకింగ్ ఆఫ్ బరాక్ ఒబామా పుస్తకాన్ని డేవిడ్ జే గ్యారో రాశారు. ఆ పుస్తకంలో ఒబామా గర్ల్ ఫ్రెండ్ గురించి రచయిత చెప్పారు.
చికాగోలో ఉన్నప్పుడు ఒబామా తన గర్ల్ ఫ్రెండ్ షీలాతో సహజీవనం చేశారు. నిజానికి షీలాను ఒబామా పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి పేరెంట్స్ కు కూడా చెప్పారు. కానీ వాళ్ల పేరెంట్స్ ఆ పెళ్లికి అంగీకరించలేదు. అమ్మాయి వయసు పెళ్లికి సరిపోదు అన్న ఉద్దేశంతో ఆమె పేరంట్స్ ఒబామాతో పెళ్లికి తిరస్కరించారు. ఆ తర్వాత ఇద్దరూ కొన్నేళ్లు చికాగోలో కలిసి ఉన్నారు. ప్రస్తుతం ఒహాయోలో షీలా జాగర్ ప్రొఫెసర్ గా చేస్తోంది. 1986లో ఒబామా తన ప్రేమలో పడ్డారని జాగర్ పుస్తకం రచయితతో పేర్కొంది. అప్పుడు ఒబామా వయసు 25 ఏళ్లు. అయితే రెండేళ్లు తనతో కలిసి ఉన్న ఒబామా గురించి జాగర్ కొన్నిఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రెసిడెంట్ కావాలన్న కాంక్ష ఒబామాలో ఎక్కువగా ఉండేదని ఆమె పేర్కొంది. హార్వర్డ్ లా స్కూల్ లో చదువుకునేందుకు వెళ్లే ముందు కూడా తనను పెళ్లి చేసుకోవాలని ఒబామా వేడుకున్నారని జాగర్ తెలిపింది. కానీ హార్వర్డ్ వెళ్లాక సీన్ మొత్తం మారింది. అక్కడ పట్టా పుచ్చుకున్న ఒబామా చికాగోలో ఓ లా కంపెనీలో పని చేశారు. అక్కడ ఒబామాను ఇంటర్వ్యూ చేసింది మిషెల్ రాబిన్‌సన్. ఆ తర్వాత మిషెల్‌ను ఒబామా పెళ్లి చేసుకున్నారు. ప్రెసిడెంట్ అయ్యేందుకు ఒబామా పడ్డ కష్టాన్ని డేవిడ్ గ్యారో తన పుస్తకంలో వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/