Begin typing your search above and press return to search.
టీ’లో అర్థరాత్రి వరకూ తాగొచ్చు..తర్వాత తినొచ్చు
By: Tupaki Desk | 15 Dec 2015 6:33 AM GMTతెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పర్యాటకంగా..పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు సమయాన్ని పెంచాలన్న అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అమలవుతున్న వేళలకు అదనంగా మరికొంత సమయం పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకూ తెలంగాణలో బార్లు రాత్రి 11 గంటల వరకూ తెరిచే ఉంటున్నాయి. తాజాగా తీసుకునే నిర్ణయం ప్రకారం ఈ సమయం అర్థరాత్రి 12 గంటల వరకూ కొనసా..గుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆహారపదార్థాల అమ్మకాలు అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకూ అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. సరికొత్త వేళల ఆదేశాలు జారీ చేయలేదని .. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
మద్యం అమ్మకాలకు సంబంధించి వేళల్ని పెంచటంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి.. మెట్రో నగరాల్లో ప్రస్తుతం బార్లు పని చేస్తున్న వేళల్ని గుర్తు చేస్తున్నారు. ముంబయిలో అర్థరాత్రి 1.30 గంటల వరకు.. ఢిల్లీలో 12.30 గంటలు.. చెన్నైలో 12 గంటలు.. ఒడిశాలో రాత్రి 1.30 గంటల వరకూ బార్లలో అమ్మకాలు జరుపుతుంటారని.. వీటితో పోలిస్తే.. తెలంగాణ సర్కారు పెంచుతున్న సమయం పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. కొత్త సంవత్సరంలో మందుబాబులకు మరింత కిక్కు ఎక్కించే నిర్ణయమే తెలంగాణ సర్కారు తీసుకోవటం ఖాయం.