Begin typing your search above and press return to search.

బార్లు తెరిచారు కానీ ఏం 'లాభం'!

By:  Tupaki Desk   |   28 Sep 2020 2:30 AM GMT
బార్లు తెరిచారు కానీ ఏం లాభం!
X
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బార్లు, క్లబ్బులు తెరుచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ బార్ల యజమానులకు సంతోషం లేదట. అందుకు కారణాలేమిటంటే.. లాక్​డౌన్ నుంచి బార్లు మూతపడటంతో గిరాకీ లేదు. అయినప్పటికీ మెయింటనెన్స్ ఖర్చు, అద్దెలు కట్టక తప్పని పరిస్థితి. దీంతో ఇప్పటికే బార్ల యజమానులు ఏదో ఒకరోజు పరిస్థితి మామూలు కొస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరి అద్దెలు కట్టారు. అయితే ఇప్పుడు బార్లు తెరిచినా మందుబాబులు బార్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే కరోనా విపత్తు ఉన్న ప్రస్తుత తరుణంలో ఇంట్లో తాగడమే సేఫ్​ అని వారు భావిస్తున్నారు. పైగా చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్న సొమ్మునే చూసుకుని వాడుకుంటూ పొదుపుగా ఉంటున్నారు. మద్యానికి ఇతర అలవాట్లకు పెట్టే ఖర్చు తగ్గించు కుంటున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వైన్స్​ తెరిచారు కాబట్టి ప్రజలంతా వైన్స్​లోనే మద్యం కొనుక్కుంటారు.. తప్ప తమ వద్దకు రారని బార్ల యజమానుల అభిప్రాయం. అందుకు కారణం బార్ల కొచ్చి పక్కన కూర్చున్న వారి నుంచి ఎక్కడ కరోనా పడతామేమోనని జనం ఆందోళన చెందడమే. దానికి తోడు బార్ల కొస్తే మందు ఒకటే కాదు..స్టఫ్ అని కూల్ డ్రింక్స్ అని ఏదోఒకటి అదనంగా ఖర్చు పెట్టాలి.అదే ఇంట్లో అయితే ఏదో ఒకటి స్టఫ్ గా తీసుకోవచ్చు. ఇక ఆదాయం కోసం ఇప్పుడున్న పరిస్థితిల్లో బార్లలో రేట్లను కూడా పెంచలేమని యజమానులు చెబుతున్నారు. ‘మేం ఇప్పుడు బార్లలో మద్యం ధరలు పెంచలేం. అక్కడ ఫుడ్​కు ధర పెంచాల్సిందే. అయితే ప్రస్తుత పరిస్థితులో ప్రజలు రెస్టారెంట్లకు కూడా వెళ్లడం లేదు. ఇక బార్లలోకి కూడా మందుబాబులు వస్తారన్న నమ్మకం లేదు. మెజార్టీ ప్రజలు వైన్స్​లోనే మందు కొనేందుకు ఇష్టపడుతున్నారు’ అంటూ బార్ల యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి బార్లు తెరిచినా తమకు ఏం ఉపయోగం లేదని బార్ల యజమానులు భావిస్తున్నారు.