Begin typing your search above and press return to search.
కొత్త ముఖ్యమంత్రిగా బొమ్మై!
By: Tupaki Desk | 27 July 2021 2:46 PM GMTకర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలతోపాటు పలు కారణాలతో ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కర్నాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై ను నియమించింది బీజేపీ హై కమాండ్.
జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బొమ్మై.. 2008లో కమలం తీర్థం పుచ్చుకున్నారు. 1998, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా.. కర్నాటకలోని షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కాగా.. బొమ్మై రాజకీయ వారసత్వం పెద్దదే. ఆయన తండ్రి ఎస్ ఆర్ బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగానే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ తోపాటు బొమ్మై సామాజిక వర్గం కూడా ముఖ్యమంత్రి పదవి రావడానికి కారణమైందని అంటున్నారు. ఈయన కూడా లింగాయత్ సమాజాకి వర్గానికే చెందినవారు కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా లింగాయతే. కర్నాటకలో వీరి ప్రాబల్యమే అధికం. ఈ కోణంలో ఆలోచించిన అధిష్టానం.. బొమ్మైని ఎంపిక చేసిందని అంటున్నారు.