Begin typing your search above and press return to search.
వైరస్ లు గబ్బిలాల్ని ఏమీ చేయవు ఎందుకు?
By: Tupaki Desk | 13 Feb 2020 1:30 AM GMTనిపా..సార్స్.. మెర్స్.. ఎబోలా.. ఈ పేర్లు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు. ఇటీవల కాలంలో ప్రపంచాన్ని కలవరపెట్టిన ఈ వైరస్ లకు ఇప్పుడు కరోనా కుటుంబానికి చెందిన కొవిడ్ 19 తీస్తున్న ప్రాణాలు వెయ్యి దాటిపోయాయి. మరో పద్దెనిమిది నెలల వరకూ ఈ పిశాచి వైరస్ కు వ్యాక్సిన్ లేదని తేల్చేశారు. దీంతో.. రానున్న రోజుల్లో కొవిడ్ కారణంగా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 వైరస్ గబ్బిలాల ద్వారానే మనుషుల్లోకి సోకినట్లు చెబుతున్నా.. ఇంకా ఆ అంశంపై స్పష్టత రాలేదు. మనుషుల్ని పిట్టల మాదిరి రాలిపోయేలా చేస్తున్న ఈ దారుణమైన వైరస్ ను శరీరంలో తలదాచుకునే గబ్బిలాలు ఎలా తట్టుకుంటున్నాయన్నది అసలు ప్రశ్న.
దీనిపై తాజాగా నేచర్ మైక్రోబయాలజీ అనే జర్నల్ వివరంగా పేర్కొంది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చింది. ఏదైనా వైరస్ మనిషిలో కానీ ఎలుకల్లో కానీ చేరిన వెంటనే.. లోపల ఉండే రోగనిరోధక వ్యవస్థ చైతన్యమవుతుంది. ఈ వైరస్ మీద పోరాడేందుకు సిద్ధమైపోతుంది. అయితే.. ఈ స్పందన స్థాయి పరిమితంగా ఉంటే ఓకే కానీ.. అందుకు భిన్నంగా తీవ్రమైతేనే తిప్పలు. రక్షణ వ్యవస్థ మొత్తం వైరస్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు.. శరీరం యుద్ధ రంగంగా మారిపోతుంది. దీంతో.. లోపల జరిగే డ్యామేజీతో మనిషి అనారోగ్యానికి గురి అవుతాడు. ఈ సందర్భంలో వైరస్ ను కంట్రోల్ చేసే మందుల్ని వాడితే.. రెట్టించిన ఉత్సాహంతో ఆ వైరస్ మీద పైచేయి సాధించే వీలుంటుంది.
మనిషి లోపల ఇంత త్వరగా రియాక్ట్ అయ్యే రోగనిరోధక శక్తి .. గబ్బిలాల వరకూ వచ్చేసరికి మాత్రం భిన్నంగా ఉంటుంది. దీనికి ఏ వైరస్ సోకినా.. దానికి స్పందించే గుణం తక్కువగా ఉంటుంది. అంటే.. సదరు వైరస్ కు గబ్బిలాలు ఆశ్రయాన్ని ఇస్తాయి. అది అంతకంతకూ విస్తరిస్తూ ఉంటుంది. దాని మానాన అది ఉంటే.. రోగనిరోధక శక్తి చూసిచూడనట్లుగా ఉంటుంది. మనుషుల్లో మాత్రం ప్రమాదకరమైన వైరస్ శరీరంలోకి ప్రవేశించినంతనే ఎన్ ఎల్ ఆర్పీ 3 అనే ప్రోటీన్ వెంటనే స్పందిస్తుంది. కానీ.. గబ్బిలాల్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. ఈ కారణంతోనే గబ్బిలాలు వైరస్ ల కుప్పగా ఉంటాయని.. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకపోయినా.. వాటి కారణంగా మనుషులు తీవ్ర ప్రభావానికి గురి అవుతుంటారని చెప్పక తప్పదు. అయితే.. ఇప్పుడు చెప్పిన విషయాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించిన పరిశోధనలు ఇంకా పూర్తి కాలేదు.