Begin typing your search above and press return to search.

బాత్‌ రూముల వ‌ల్లే..టీ బీజేపీ ఓడిపోయింద‌ట‌

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:23 PM GMT
బాత్‌ రూముల వ‌ల్లే..టీ బీజేపీ ఓడిపోయింద‌ట‌
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన బీజేపీ త‌ర‌ఫు నుంచి ఓ అనూహ్య‌మైన‌ క్లారిటీ వ‌చ్చింది.ఎన్నికల్లో ఓటమికి కారణం ప్రజలు ఆదరించలేదని - ఎదుటిపక్షం బాగా డబ్బులు పంచారని.. లేదంటే రిగ్గింగ్ జరిగిందని - సరైనా ప్రచారం చేయలేదని - సరైన అభ్యర్థిని నిలబెట్టలేదని అనూమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఎన్నికలో ఓటమికి బీజేపీ సరికొత్త భాష్యం చెప్పింది. వాస్తు దోషం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వాస్తు దోషంతో నిర్మిస్తున్న బాత్ రూమ్ లే బీజేపీ కొంపముంచాయని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీజేపీ నేతలు అభిప్రాయానికి రావ‌డం ఆస‌క్తికరంగా మారింది.

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా118 స్ధానాల్లో పోటీ చేసి ఒక్క స్ధానంలో గెలిచి ఘోర పరాజయాన్నిమూటగట్టుకుంది. స్వామి పరిపూర్ణానందను రంగంలోకి దింపి ప్రచారం చేసినా కూడా బీజేపీ కి ఎక్కడా కలిసొచ్చినట్లు కనపడలేదు. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనుకున్న నాయకులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ప్రధాన మంత్రి మొదలు పలువురు కేంద్రమంత్రులు - బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేసినా బీజేపీ కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 118 స్ధానాల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసిన హేమా హేమీలంతా ఓడిపోగా 60 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన రాజాసింగ్ ఒక్కరే గెలిచి రేపు ఏర్పడబోయే కొత్త అసెంబ్లీ లో బీజేపీ తరుఫున ఒకే ఒక్కడుగా నిలిచారు. రాజాసింగ్ తన సమీప టీఆర్ ఎస్ అభ్యర్ధి ప్రేమ్ సింగ్ రాధోడ్ పై 17 వేల 758 ఓట్ల మెజార్టీతో గెలిచి రాష్ఠ్రంలో బీజేపీ పరువు నిలబెట్టారు.

అయితే ఈ ప‌రాజ‌యానికి కొత్త కార‌ణం వెతికి వాస్తును బూచీగా చూపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇటీవలే ఆధుణీకరించారు. టెర్రస్ పైన నాలుగు బాత్ రూమ్ లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడివే బీజేపీ పాలిట శాపంగా మరాయంటున్నారు. అందువల్లే నలుగురు పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు. ఈమేరకు బీజేపీ సీరియర్ నేత - వాస్తు నిపుణులు రాజారావు ఓ మీడియా సంస్థ‌కు తెలిపారు. వాస్తుదోషంతో నిర్మిస్తున్న బాత్ రూమ్‌లే బీజేపీకి శాపమన్నారు. వాస్తుదోషంతో పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. భవనానికి రెండు వైపులా వీధి పోట్లు ఉండటం దోషమే అని తెలిపారు. వాస్తుదోషం జాతీయ నేతలపైనా ప్రభావం చూపుతుందన్నారు.