Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ సవాల్ ను గబ్బిలాలే తీరుస్తున్నాయా?

By:  Tupaki Desk   |   14 July 2020 12:00 PM IST
కరోనా వ్యాక్సిన్ సవాల్ ను గబ్బిలాలే తీరుస్తున్నాయా?
X
ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలానే కరోనా వ్యాక్సిన్ ను.. దానికి కారణమైన గబ్బిలాలతోనే లెక్క సరిచేయాలా? అన్నట్లుగా ఒక ఆసక్తికర పరిశోధన సాగుతోంది. వ్యాక్సిన్ తయారీ కోసం ఎన్నో కంపెనీలు కిందామీదా పడుతున్నాయి. రకరకాల కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలోని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశంపై తమ పరిశోధనను చేపట్టారు.

వైరస్ ఏదైనా కానీ.. ఇటీవల కాలంలో మానవాళికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి వైరస్ లకు కారణంగా గబ్బిలాలు చెబుతున్నారు. మరి.. మనుషుల్ని ఇంతలా వేధిస్తున్న వైరస్ లు మోసుకొచ్చే గబ్బిలాలు మాత్రం ఎలాంటి ప్రభావానికి ఎందుకు లోనుకావటం లేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై పరిశోధనలు చేపట్టారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు.

వైరస్ ను గుర్తించిన వెంటనే మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ వెంటనే స్పందించటమే అసలు కారణంగా తేల్చారు. అదే సమయంలో గబ్బిలాల్లోని రోగ నిరోధక వ్యవస్థ మాత్రం చాలా పరిమిత స్థాయిలోనే స్పందిస్తున్నట్లుగా గుర్తించారు. వైరస్ లోడ్ తమలో పెరగకుండా ఉండేందుకు గబ్బిల్లాల్లో ప్రత్యేక వ్యవస్థ క్రియాశీలకంగా ఉందని.. అదే సమయంలో మనుషుల్లో మాత్రం వైరస్ సోకినంతనే రోగనిరోధరక వ్యవస్థ తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుందని గుర్తించారు.

ఈ కారణంతోనే జ్వరం.. వాపులు.. ఇతర లక్షణాలు బయటపడుతున్నాయి. రోగనిరోధక శక్తి స్పందించి తిప్పి కొట్టే క్రమంలో బయటపడే వ్యాధులకుకారణమైన పలు జన్యువులు గబ్బిలాల్లో లేవని చెబుతున్నారు. మనుషుల్లోని ఈ జన్యువుల స్పందనల్ని నియంత్రించే మందుల ఉత్పత్తితో కరోనా కంట్రోల్ కావొచ్చని చెబుతున్నారు. ఇవే కాదు.. గబ్బిల్లాల్లో ఎగిరే గుణం కూడా వాటిలో వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా చేస్తున్న విషయాన్ని గుర్తించారు. వీటి ఆధారంగానే వ్యాక్సిన్ తయారు చేయనున్నట్లు చెబుతున్నారు.