Begin typing your search above and press return to search.
గబ్బిలాల పై కరోనాకి ఎందుకంత కరుణ !
By: Tupaki Desk | 9 May 2020 2:30 AM GMTగబ్బిలం ... ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం చైనాలో వెలుగులోకి వచ్చి , ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనాలో ఈ వైరస్ గబ్బిలాల నుండే వ్యాప్తి చెందింది అని వార్తలు వినిపించడంతో ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు గబ్బిలం అంటేనే భయపడిపోతున్నారు.అయితే , ఇదే సమయంలో అందరిలో మెదులుతున్న మరో ప్రశ్న ..ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఈ వైరస్ గబ్బిలం పై ఎందుకు ప్రభావం చూపలేకపోతుంది అని, ఈ వైరస్ సోకగానే ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గిపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే గబ్బిలాలకి మాత్రం ఏమి కావడంలేదు.
మనుషుల ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా వైరస్, గబ్బిలాలను ఏమీ చేయలేకపోవడంపై కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ సస్కాచ్వెన్ , ఇతర సంస్థలతో కలిసి పరిశోధనలు చేసింది. పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విక్రమ్ మిశ్రా వివరించిన ప్రకారం కరోనా వైరస్ గబ్బిలం కణజాలంపై దాడి చేయదు.వాటి రోగ నిరోధక వ్యవస్థకు నష్టం చేయదు. గబ్బిలంలోని కణజాలాలతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంటుంది. గబ్బిలాల్లోని అసాధారణ రోగ నిరోధక శక్తి వైరస్ అలా బంధం ఏర్పర్చుకోవడానికి ఒక కారణం. మెర్స్ వైరస్ పై పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.