Begin typing your search above and press return to search.

గ‌బ్బిలాలపై విస్తృత ప‌రిశోధ‌న‌లు..ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి

By:  Tupaki Desk   |   1 May 2020 11:30 PM GMT
గ‌బ్బిలాలపై విస్తృత ప‌రిశోధ‌న‌లు..ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి
X
గ‌బ్బిలాల ద్వారా కూడా క‌రోనా వైర‌స్ సోకుతుంద‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది అవాస్త‌వ‌మ‌ని.. గ‌బ్బిలాల ద్వారా కరోనా సోక‌ద‌ని తేలింది. అయితే ఆ పుకార్లు వ‌చ్చిన స‌మ‌యంలో కొంద‌రు గ‌బ్బిలాల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. అయితే ఆ ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయంట‌. ప్ర‌స్తుతం మ‌నం ఆ వైర‌స్ సోకకూడ‌ద‌ని భౌతిక దూరం పాటిస్తున్నాం. ఆ భౌతిక దూరం ఉండాల‌నే లాక్‌డౌన్ విధించుకున్నాం. అయితే ఈ భౌతిక దూర‌మ‌నేది మ‌నం ఇప్పుడు పాటిస్తున్నామ‌ని, మ‌న‌తో పాటు గ‌బ్బిలాలు కూడా భౌతిక దూరం పాటిస్తాయ‌ని గుర్తించారు. సాధార‌ణంగా గ‌బ్బిలాలు అనారోగ్యానికి గుర‌యితే వాటికి అవే భౌతిక దూరం పాటిస్తాయంట.

ప్ర‌స్తుతం మ‌నం భౌతిక దూరం పాటిస్తున్నాం కానీ ఇన్పెక్షన్‌తో కూడిన జబ్బులు వచ్చినప్పుడు గబ్బిలాలు ఆ విధంగా త‌మ‌ను తాము దూరం పాటిస్తాయని.. అయితే వాంపైర్ జాతికి చెందిన గబ్బిలాలు మాత్రమే ఇలా చేస్తాయని టెక్సాస్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన అధ్య‌య‌నంలో తేలింది. ఆహారం వెతుక్కునే క్రమంలో గబ్బిలాలు గుంపుగా ఉంటాయి. అయితే ఒంట‌రిగా క‌నిపించాయంటే అవి అనారోగ్యంతో ఉన్నాయేన‌ని తేల్చిచెప్పారు. జబ్బు చేసినవి మాత్ర‌మే ఒంట‌రిగా క‌నిపిస్తాయ‌ని ఆ అధ్య‌య‌నం చేసిన వారు గుర్తించారు.

ఈ గ‌బ్బిలాలు అన్ని జ‌బ్బుల‌కు కాదు కేవ‌లం వైట్ నోస్ సిండ్రోమ్, ఫంగల్ డిసీజ్ వంటివి సోకితేనే భౌతిక దూరం పాటిస్తాయంట‌. ఈ అధ్య‌య‌నం బ్రౌన్ రంగు గబ్బిలాలపై పరిశోధనలు చేయ‌గా తెలిసింది. అయితే జబ్బు చేసిన వాటిని సులువుగా గుర్తించ‌వ‌చ్చ‌ని అధ్య‌య‌నంలో తెలిపారు. వ్యాధి సోకిన గ‌బ్బిలం వెంట్రుకలు తక్కువగా ఉంటాయ‌ని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు.