Begin typing your search above and press return to search.

వెలగపూడిలో మళ్లీ రణరంగం

By:  Tupaki Desk   |   28 Dec 2020 3:34 PM GMT
వెలగపూడిలో మళ్లీ రణరంగం
X
గుంటూరు జిల్లా రణరంగాన్ని తలపించింది. ఓ కాలనీ పేరును సూచించే ఆర్చ్ నిర్మాణం విషయంలో మొదలైన గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాష్ట్ర సచివాలయం కొలువుదీరిన వెలగపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఆర్చ్ నిర్మాణాన్ని ఒక సామాజికవర్గం అడ్డుకుంది. తమ స్థలంలో నిర్మాణం చేపట్టరాదంటూ పిల్లర్లను తొలగించారు. ఇదే క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. పరస్పర దాడులకు దారితీసింది. రాళ్లు రువ్వుకొని కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు.

వెలగపూడిలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 8మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మ అనే మహిళ మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది.

స్థానిక ప్రజాప్రతినిధుల వల్లే ఈ ఘర్షణ జరుగుతోందని ఓ వర్గం ఆరోపించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రత్యేక పోలీసు బలగాలను వచ్చాయి. కొందరినీ అదుపులోకి తీసుకున్నారు.

చనిపోయిన మరియమ్మ మృతదేహంతో తిరిగి గ్రామానికి వచ్చిన ఓ సామాజివర్గం.. స్థానికంగా ధర్నాకు దిగింది.. దీంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి...

మరోవైపు ఇదే వ్యవహారంపై హోం మంత్రి సుచరిత దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలోనే తేల్చుకోవాలని ఆమె సూచించడంతో వెనుదిరిగారు.. ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికీ రగులుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొంది.