Begin typing your search above and press return to search.
ప్రముఖులకు షాకిస్తున్న ట్విట్టర్ పిట్ట!
By: Tupaki Desk | 13 July 2018 1:30 PM GMTసోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చి.. దాని విస్తృతి పెరిగిన తర్వాత నిజం ఏమిటి? అబద్ధం ఏమిటి? అన్నది అర్థంకానట్లుగా తయారైంది. రెండింటి మధ్య సరళరేఖ అంతకంతకూ పలుచనైపోతున్న పరిస్థితి. ఇందుకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రముఖులకు భారీ షాకుల్ని ఇస్తున్నాయి.
ప్రపంచానికే పెద్దన్నఅయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు దేశ ప్రధాని మోడీ వరకూ.. సినీ ప్రముఖులు బిగ్ బి అమితాబ్ మొదలు టాలీవుడ్ స్టార్ట్ మహేశ్ బాబు వరకూ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ఫేక్ ఖాతాల్ని ట్విట్టర్ శాశ్వితంగా తొలగిస్తుండటంతో ప్రముఖులకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య బేర్ గాండ్రించే వేళ.. షేర్ మార్కెట్లో షేర్ల విలువ టపటపా పడిపోయిన చందంగా ఫాలోవర్ల సంఖ్య పడిపోతోంది.
ప్రధాని మోడీకి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఇటీవల 43.4 మిలియన్లు ఉండగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే అది 43.1 మిలియన్లకు పడిపోయింది. ఫేక్ ఖాతాల్ని తొలగిస్తుండటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో.. ప్రముఖులకు సంతృప్తి కలిగించే ఫాలోయర్ల సంఖ్య అంతకంతకూ కరిగిపోతుండటం వారికి షాకింగ్ గా మారుతోంది. ఫాలోవర్లు తగ్గిపోతున్న రాజకీయ సినీ రంగ ప్రముఖుల్లో షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.