Begin typing your search above and press return to search.
మహాకూటమిలో ఇప్పుడు 'బీసీ' ల లొల్లి..
By: Tupaki Desk | 2 Oct 2018 5:30 PM GMTఎన్నికల వేళ అన్ని పార్టీల బీసీలు ఏకమయ్యారు. అన్ని సీట్లు అగ్రవార్ణాలకేనా మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మంలో జరుగుతున్న ఈ వ్యవహారం మహా కూటమిలో లుకలుకలకు దారి తీసింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ ఉండిపోయింది. ఆశావహుల చిట్టా టీడీపీ - సీపీఐ - కాంగ్రెస్ లలో కొంచెం పెద్దగానే ఉండటంతో సీట్ల సర్దుబాటు చేసేది ఎలా అని జానారెడ్డి - ఇతర నేతలు తల పట్టుకున్నారట.
అధికార టీఆర్ ఎస్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు మహా కూటమిలా ఏర్పడినా - సీట్ల సర్దుబాబు విషయం కలవరపెడుతోంది. ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారో తెలియక ఆయా నియోజకవర్గాల క్యాడర్ లో అనిశ్చితి నెలకొని ఉంది. సీటు తమ నాయకుడికే కాదు తమ నేతకు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చివరకు అసమ్మతికి ఆజ్యం పోసేలా తయారైంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐలకు ఓటు బ్యాంకు ఉండటంతో అన్ని పార్దీల నేతలు చూపు అటువైపు పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో రెండు ఎస్సీ రిజర్వ్ డ్ - ఐదు ఎస్టీ రిజర్వ్ డ్. టీడీపీ 4 - సీపీఐ 3 డిమాండ్ చేస్తున్నాయి. ఎవరికి వారు పైరవీలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా, బీసీ నినాదాన్ని కొందరు తెరపైకి తెచ్చారు. బలమైన బీసీ సామాజిక వర్గం ఉన్న చోట అగ్రవర్ణాలకు సీటు ఇవ్వవద్దని మొరపెట్టుకుంటున్నారు. ఎస్సీ - ఎస్టీ రిజర్బ్ డ్ స్థానాలు పోనూ మిగిలేది మూడే. ఈ జనరల్ స్థానాల్లో అగ్ర వర్ణ నేతలే బరిలోకి దిగితే తమ సంగతేంటని అంటున్నారు బీసీలు. పాలేరు - ఖమ్మం - కొత్తగూడెం నియోజవర్గాల్లో టిక్కెట్ వార్ రంజుగా ఉంది. అగ్రకులాలు వర్సెస్ బీసీలుగా విడిపోయారనే ప్రచారం జరుగుతుంది.
ఖమ్మం టిక్కెట్ ను ఈ సారి తమకే ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయడానికి వ్యాపార వేత్త గాయత్రి రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి అహ్మద్ పటేల్ తో మంచి సంబంధాలు ఉన్నాయట గాయత్రి రవి కి. హైదరాబాద్ లోనే ఉంటూ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట. అయితే, పొత్తుల్లో భాగంగా టీడీపీ సీటు ఇవ్వాలని కోరుతుందట. నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచి బరిలో దింపడానికి ప్రయత్నం చేస్తుందట. ఇప్పటి వరకు ఖమ్మంలో గెలిచిన నేతలంతా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని, కాబట్టి టిక్కెట్ తమకే ఇవ్వాలని బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరతున్నారట. రేణుకా చౌదరి, నాగేశ్వరరావు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పాలేరు నియోజవకర్గంలో కమ్మ - రెడ్డి - కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయట. ఓట్ల పరంగా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నా - ఓట్ల పరంగా కాంగ్రెస్ నేతల రెడ్డి సామాజిక వర్గం నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉందట, ఈ సారి కూడా టిక్కెట్ తమ సామాజిక వర్గ నేతకే ఇవ్వాలని రెడ్డి నేతలు కోరుతున్నారు. రఘురామరెడ్డి - కందాల ఉపేందర్ రడ్డి పేర్లే విన బడుతున్నాయి. ఇక మూడోది కొత్తగూడెం. బీసీ ఓటింగ్ ఎక్కవ. కాంగ్రెస్ కు బలమైన ఓటింగ్ ఉంది. ఇక్కడ వనమా వెంకటేశ్వరరావు మంచి క్యాడర్ ఉంది. ఈయన బీసీ నేత. మంత్రిగా కూడా పని చేశారు. కాగా, మహా కూటమిలో భాగంగా టీడీపీ - సీపీఐ కొత్త గూడెంను అడుగుతున్నాయట. టీడీపీ నేత కోనేరు సత్యనారాయణ - సీపీఐ నేత కోనంనేని సాంబశివరావు టిక్కెట్ ఆశిస్తున్నారట. వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గ నేతలు.
పొత్తులో భాగంగా కమ్మ సామాజిక వర్గాలకే ఇస్తే తమ పరిస్థితి ఏంటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారట. కేవలం తాము ప్రచారాలకే తప్ప పోటీ చేయడానికి అర్హులం కామా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం మూడు నియోజవర్గాలు తమకు కేటాయించాలని బీసీలు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు మహా కూటమి కి పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే టీఆర్ ఎస్ టిక్కెట్లను కేటాయించేసింది. గ్రౌండ్ వర్కు చేసుకుంటున్నారు. మహా కూటమి మాత్రం త్వరగా సీట్లను తేల్చేసే పనిలో ఉన్నా కొత్త తలనొప్పలు తెచ్చి పెట్టేలా ఉంది. చివరికి రాజకీయ దుమారం ఎటువైపునకు దారితీస్తుందో చూద్దాం.