Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న లీకైన జాబితా!!
By: Tupaki Desk | 31 Oct 2018 9:57 AM GMTమహాకూటమి పేరుతో ప్రధాన పార్టీలను ఏకం చేసి అధికార టీఆర్ ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీని అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుంటే..మరోవైపు నాయకుల్లో అసంతృప్తి కూడా పెరిగిపోతోంది. తాజాగా బీసీ నేతల్లో తీవ్రంగా అసహనం మొదలైనట్లు చెప్తున్నారు. తొలిదశలో ప్రకటించబోయే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ఇదేనని పేర్కొంటూ కొంతమందితో కూడిన జాబితా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జాబితాపై పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. బీసీలకు ఈ ఎన్నికల్లో తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎదుర్కొబోయే పరిణామాలను ఆ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. రాజకీయంగా బీసీ నాయకులను అభివృద్ది చేయకుండా ఇప్పటికే చాలా నష్టం చేసిందని రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుందంటున్నారు.
40 మందితో కూడిన జాబితా ఇది అంటూ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బీసీ నేతలకు చోటు లేకపోవడం ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీలు స్క్రీనింగ్ కమిటీని కలిసి బీసీలకు బలం ఎక్కడెక్కడ ఉన్నది. ఎక్కడైతే గెలుస్తారనే విషయాన్ని ఇచ్చారని అయినా వారికి చోటివ్వడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామంటే బీసీలు గెలవలేరంటూ రాష్ట్ర నాయకత్వం అవమానపరుస్తుందని వాపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 నుంచి తెలంగాణ ప్రాంతంలో 50శాతానికి మించి సీట్లు రాలేదు. ఆంధ్రా - రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు వచ్చిన మోజార్టీ ఫలితాలే పార్టీని గద్దెమీద కూర్చొ బెట్టాయి. బీసీలకు ఈసారి సీట్లు ఇవ్వకపోతే ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తు న్నారు. వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటుపడినా రాజకీయ అవకాశాలు ఇవ్వలేదని - అందుకే బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని మండిపడుతున్నారు.
హైదరాబాద్ లో గోషామహల్ - ముషిరాబాద్ - అంబర్ పేట్ - ఖైరతాబాద్ - రంగారెడ్డిజిల్లాలో ఎల్బీనగర్ - రాజేంద్రనగర్ - ఇబ్రహీంపట్నం - తాండూరు - శేరిలింగంపల్లి - మల్కాజిగిరి - నిజామాబాద్ లో నిజామాబాద్ అర్బన్ - బాన్సువాడ - ఎల్లారెడ్డి - ఆర్మూర్ నియోజకవర్గాలు కేటాయించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు - కొత్తగూడెం నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గం బలంగా ఉంటుందని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ లో హుస్నాబాద్ - కోరుట్ల - పెద్దపల్లి - రామగుండం - వేములవాడ - సిరిసిల్ల - నల్లగొండ జిల్లాలో మునుగోడు - ఆలేరు - భువనగిరి - మిర్యాలగూడ - సూర్యపేట్ - నల్లగొండ - మహాబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ - దేవరకద్ర - నారాయణపేట - కొల్లాపూర్ - జడ్చర్ల - నాగర్ కర్నూల్ - వరంగల్ లో నర్సంపేట్ - వరంగల్ తూర్పు - పరకాల - జనగామా - ఆదిలాబాద్ లో ముథోల్ - సిర్పూర్ లలో పార్టీ బలంగా ఉందని - అక్కడ బీసీ నేతలకు చాన్సివ్వకపోతే పార్టీ ఓటమి పాలవడం ఖాయమంటూ కొందరు నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం కాంగ్రెస్ లోని అసంతృప్తికి నిదర్శనం.