Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రిని నిల‌దీసిన సొంత ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   7 Sep 2018 7:41 AM GMT
ఏపీ మంత్రిని నిల‌దీసిన సొంత ఎమ్మెల్యే!
X
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు చప్ప‌గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. విప‌క్షం లేకుండా సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయ‌న్న విమ‌ర్శ ఉంది. ఇలాంటివేళ‌.. ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. విప‌క్షం లేకున్నా.. అధికార‌ప‌క్షానికి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు వేసిన ప్ర‌శ్న‌కు ఏపీ మంత్రికి ఇబ్బందిక‌రంగా మారంది. త‌న ప్ర‌శ్న‌ల‌తో షాకిచ్చిన ఈ వైనం ఇప్పుడు అంద‌రి చూపు ప‌డేలా చేయ‌ట‌మే కాదు.. ఏపీలో బాబు పాల‌న ఎలా ఉంద‌న్న అవ‌గాహ‌న క‌ల్పించేదిగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లి మైనింగ్ బ్లాస్టింగ్ పై ఎమ్మెల్యే బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. రోడ్డుకు 150 మీట‌ర్ల దూరంలో మైనింగ్ ఉండాల‌న్న నిబంధ‌న కూడా అమ‌లు కావ‌టం లేద‌న్న ఆయ‌న‌.. అక్ర‌మ బ్లాస్టింగ్ కార‌నంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌న్నారు.

అక్ర‌మ మైనింగ్ బ్లాస్టింగ్ ల‌పై అధికారులు.. పోలీసులు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన అధికార‌ పార్టీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌కు మంత్రి ఇబ్బంది ప‌డ్డారు. దీనిపై మంత్రి సుజ‌య‌కృష్ణ స‌మాధాన‌మిస్తూ మైనింగ్ సేఫ్టీ త‌మ ప‌రిధిలో లేద‌ని.. హైద‌రాబాద్‌ లోని డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మైనింగ్ సేఫ్టీ అధ్వ‌ర్యంలో ఉంటుంద‌ని సెల‌విచ్చారు.

త‌మ ప‌రిధిలో లేద‌ని అక్ర‌మాలు జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోరు క‌దా? ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వం చొర‌వ తీసుకొని వారి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాలే కానీ.. హైద‌రాబాద్‌ లో ఉంటుంద‌ని ఊరుకుంటే స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది. అక్ర‌మ మైనింగ్ తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్ర‌శ్నించే వ‌ర‌కూ మంత్రిగారి దృష్టికి అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం రాక‌పోవ‌టం ఏమిటో..?