Begin typing your search above and press return to search.

బీసీ మంత్రం.. బాబుకు-జ‌గ‌న్‌కు తేడా ఇదే!

By:  Tupaki Desk   |   19 March 2021 4:31 AM GMT
బీసీ మంత్రం.. బాబుకు-జ‌గ‌న్‌కు తేడా ఇదే!
X
``బీసీలే టీడీపీ వెన్నెముక‌! పార్టీలోను.. ఇత‌ర‌త్రా ప‌ద‌వుల్లోనూ వారికే సింహ‌భాగం ఇస్తాం!``- ఇదీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీసీ సామాజిక వ‌ర్గాల‌ను ఉద్దేశించి చేసే ప్ర‌సంగం. మ‌రి ఇలానే ఆయ‌న చేసి ఉం టే.. నేడు ప‌డిని స్థానిక ఓట్ల‌లో వైసీపీకి బీసీ వ‌ర్గం ఓట్లు ఎందుకు మ‌ళ్లాయి? ఎక్క‌డ జ‌రిగింది? తేడా? టీడీ పీకి ఎందుకు ద‌క్క‌లేదు? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. దీనిపై టీడీపీ సైతం అంత‌ర్మ‌థ‌నం సాగిస్తోంది. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చిన మాట వాస్త‌వ‌మే! ఈ విష‌యంలో చంద్ర‌బాబును త‌ప్పు ప‌ట్ట‌లేం. అయితే... ఎవ‌రికి ఇచ్చార‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌.

బీసీలు అంటే.. కొత్త‌గా ఎవ‌రినైనా తీసుకువ‌చ్చి ప‌ద‌వులు ఇచ్చారా? లేక ఏళ్ల త‌ర‌బ‌డి టీడీపీలోనే ఉంటూ .. ప‌లు మార్లు ప‌రాజ‌యాలు చ‌వి చూసిన వారికి.. ప‌లుమార్లు... పార్టీ నుంచి బ‌య‌ట‌కు లోప‌లికి తిరిగిన వా రికి ప‌ద‌వులు ఇచ్చారా? అంటే.. రెండోదే క‌రెక్ట్ అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివ‌ల్ల‌.. క్షేత్ర‌స్థాయిలో కొత్త‌గా బీసీ నాయ‌క‌త్వం.. టీడీపీకి చేరువ కాలేదు.. ఉన్న‌వారే ప‌ద‌వులు చేప‌ట్ట‌డం.. ఉన్న‌వారికే ప్రాధాన్యం ఉండడం... వారు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక‌పోవ‌డం .. వంటివి బీసీ మంత్రం విక‌టించేలా చేసింది. పైగా సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నుంచి ఈ వ‌ర్గం.. ఎక్కువ‌గానే ఆశిస్తోంది.

ఈ నేప‌థ్యంలో బీసీల‌కు అనుకూలంగా క్షేత్ర‌స్థాయిలో కొత్త వారిని బ‌లోపేతం చేయ‌డం స‌హా.. ప‌ద‌వుల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించి.. విఫ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. 2019లోనే ఎంతో మంది పాత నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఇదే బీసీ సామాజిక వ‌ర్గానికి వ‌ర్గానికి చెందిన కొత్త ముఖాల‌కు అవ‌కాశం ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు బేల్ దారి మేస్త్రీలుగా ఉన్న‌వారికి. ఇత‌ర చేతి వృత్తుల్లో ఉన్న వారికి రాజ‌కీయంగా ప్రాధాన్యం పెంచారు.

ఇది.. రాజ‌కీయంగా వైసీపీకి మైలేజీ ఇచ్చింది. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన స్థానిక స‌మ‌రంలోనూ జ‌గ‌న్ ఇదే ఫార్ములా ఎంచుకున్నారు.. సీనియ‌ర్ల‌ను... జంపింగుల‌ను ప‌క్క‌న పెట్టిమ‌రీ.. కొత్త ముఖాల‌కు మేయ‌ర్లుగా, చైర్మ‌న్లుగా, చైర్ ప‌ర్స‌న్లుగా అవ‌కాశం క‌ల్పించారు.. ఇది.. బీసీ సామాజిక వ‌ర్గంలో వైసీపీకి భ‌రోసా పెంచుతోంది. అందుకే ఇంత భారీ స్థాయిలో స్థానిక విజ‌యాన్ని న‌మోదు చేయ‌గ‌లిగింది. మ‌రి ఈ త‌ర‌హాలో వెళ్లాల్సిన అవ‌స‌రం టీడీపీకి కూడా ఉంది. లేనిప‌క్షంలో కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మై.. మున్ముందు మ‌రింత సంక‌ట స్థితిని ఎదుర్కొనాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.